AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోలీవుడ్‌కు కొత్త విజయ్ దొరికేసారా..?

కోలీవుడ్‌కు కొత్త విజయ్ దొరికేసారా..?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: May 20, 2026 | 7:05 PM

Share

విజయ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కోలీవుడ్‌లో అతని స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న చర్చకు ‘కరుప్పు’తో సూర్య సమాధానంగా కనిపిస్తున్నారు. భారీ ఓపెనింగ్స్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమా మూడు రోజుల్లోనే 147 కోట్ల గ్రాస్ సాధించింది. సినిమాలో విజయ్ రిఫరెన్సులు, థ్యాంక్స్ కార్డ్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకోగా.. ఇకపై కోలీవుడ్ కొత్త విజయ్ సూర్యనే అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

తమిళనాట విజయ్ రాజకీయాల్లోకి వెళ్ళడం ఎవరికి కలిసొచ్చింది..? రజినీకాంత్, కమల్ హాసన్ అంటే ఎలాగూ సీనియర్లు అయ్యారు కాబట్టి పోటీలో పెట్టకూడదు. అజిత్ కూడా సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. మరి విజయ్ ఎగ్జిట్ ఎవరికి హెల్ప్ కానుంది.. సూర్య ఆ ప్లేస్ తీసుకుంటున్నారా..? కరుప్పు రికార్డ్ ఓపెనింగ్స్ వెనక ఉన్న కారణమేంటి..? కోలీవుడ్‌కు కొత్త విజయ్ దొరికేసారా..? 2026లో ఫస్ట్ టైమ్ కోలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది.. జనవరి నుంచి చూస్తున్నారు వాళ్లు ఒక్క సినిమా అయినా రాకపోదా.. కలెక్షన్ల వర్షం కురిపించకపోదా అని..! ఇన్నాళ్లకు వాళ్ల కోరిక నెరవేరింది. కరుప్పుతో సూర్య ఆ లోటు తీర్చేసారు.. ఫస్ట్ డే నుంచి ఈ సినిమా రికార్డ్ ఓపెనింగ్స్ తెచ్చుకుంటుంది. 3 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా 147 కోట్ల గ్రాస్ వసూలు చేసింది కరుప్పు. నిజానికి 2026లో తమిళనాట ఒక్క పెద్ద సినిమా కూడా రాలేదు.. జన నాయగన్ పొంగల్‌కే రావాల్సి ఉన్నా ఆగిపోయింది. మొన్నొచ్చిన ధనుష్ కర సినిమా కూడా పెద్దగా ఆడలేదు. ఇలాంటి సమయంలో వచ్చిన కరుప్పు నెక్ట్స్ లెవల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. సూర్యకు సరైన హిట్ లేక దశాబ్ధం దాటిపోయింది.. ఈ లోటు అంతా కరుప్పు తీర్చేస్తుందిప్పుడు. కరుప్పు సెన్సేషన్‌కు విజయ్ కూడా ఓ కారణమే. సినిమా మొదట్లోనే CM విజయ్‌కు థ్యాంక్స్ కార్డుతో పాటు.. సెకండాఫ్‌లో లియో సీన్ రిఫరెన్స్ వాడుకున్నారు. ఇవన్నీ విజయ్ ఫ్యాన్స్‌కు బాగా నచ్చేస్తున్నాయి. అంతేకాదు ఇక మీద విజయ్ స్థానాన్ని సూర్యనే భర్తీ చేస్తారని నమ్ముతున్నారు అభిమానులు. ఈ దూకుడు ఇలాగే సాగితే నెక్ట్స్ సూర్య సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే.. బాక్సాఫీస్ దగ్గర ఊచకోత ఖాయం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

MS Dhoni: రిటైర్మెంట్‌‌పై ధోనీ.. హింట్‌ ఇచ్చినట్లేనా?

Jayam Ravi: భార్య VS లవర్‌! దెబ్బకు పిచ్చోడిలా తయారైన స్టార్ హీరో

20లక్షల కోసం.. హీరోయిన్‌ను చంపేసిన భర్త?

పాపం! ఆ స్టార్‌ను చూస్తుంటే బాధేస్తోంది..

Peddi: అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..

Follow Us