గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఈ మ్యాటర్ తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై చెప్పేస్తారు..
సెలబ్రిటీల ప్రభావంతో గడ్డం పెంచుకోవడం యువతలో ట్రెండ్‌గా మారింది. అయితే గడ్డం కేవలం స్టైల్‌కే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని చాలా మందికి తెలీదు. UV కిరణాల నుంచి రక్షణ, చర్మం తేమగా ఉండటం, అలర్జీలు తగ్గడం, వృద్ధాప్య లక్షణాలు ఆలస్యంగా రావడం వంటి అనేక ప్రయోజనాలు గడ్డం వల్ల కలుగుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.

ప్రస్తుతం యువతలో గడ్డం పెంచుకోవడం ఒక ఫ్యాషన్ ట్రెండ్‌గా మారిపోయింది. సినీ నటులు, క్రికెటర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇలా చాలామంది స్టైలిష్ బియర్డ్ లుక్స్‌తో కనిపిస్తుండటంతో యువకులు కూడా వారిని ఫాలో అవుతున్నారు. గుబురు గడ్డంతో తమ లుక్స్ పూర్తిగా మార్చేసుకుంటున్నారు. ఓ రకంగా నేటి యువత స్టై్ల్‌కు గడ్డం కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. అయితే గడ్డం కేవలం స్టైల్‌కే కాదు.. ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలు అందిస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
UV కిరణాల నుంచి రక్షణ
గడ్డం పెట్టుకోవడం వల్ల ముఖ చర్మం నేరుగా సూర్యుడి యూవీ కిరణాల ప్రభావానికి గురికాదు. దీని వల్ల చర్మం టానింగ్‌కు గురికాకుండా ఉండటమే కాకుండా, ఫేస్ స్కిన్ డ్యామేజ్ ప్రమాదం కూడా తగ్గుతుంది.
చర్మం తేమగా ఉండటానికి సహాయం
గడ్డం పెట్టుకుంటే చల్లని గాలి నేరుగా ముఖం చర్మాన్ని తాకదు. దీంతో చర్మం పొడిబారకుండా తేమగా ఉంటుంది. ఫలితంగా పగుళ్లు, పొడిబారడం, మొటిమలు వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది.
గొంతు, శ్వాసకోశానికి మేలు
గాలిలో ఉండే దుమ్ము, ధూళి, కొన్ని బ్యాక్టీరియా నేరుగా నోటిలోకి వెళ్లకుండా గడ్డం వెంట్రుకలు కొంతవరకు అడ్డుకుంటుంది. దీని వల్ల గొంతు ఇన్ఫెక్షన్లు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే జలుబు, అలర్జీలు, ఉబ్బసం సమస్యల నుంచి కూడా కొంత రక్షణ లభిస్తుంది.
వృద్ధాప్య ఛాయలు ఆలస్యం..
గడ్డం వల్ల ముఖ చర్మం సూర్యరశ్మి, ధూళి ప్రభావానికి తక్కువగా గురవుతుంది. దీంతో ముఖంపై ముడతలు త్వరగా రావు. చర్మం సహజ కాంతిని కూడా ఎక్కువ కాలం నిలుపుకుంటుంది. అంటే వృద్ధాప్య లక్షణలను కొంత మేర ఆలస్యమయ్యేందుకు ఇది దోహదం చేస్తుంది.
షేవింగ్ వల్ల వచ్చే ఇబ్బందులకు చెక్
తరచూ షేవింగ్ చేసుకునే వారిలో చిన్న గాయాలు, చర్మ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే గడ్డాన్ని కేవలం ట్రిమ్ చేసుకుంటూ మెయింటైన్ చేసే వారికి ఈ సమస్యలు తక్కువగా ఉంటాయి.
స్టైల్‌తో పాటు కాన్ఫిడెన్స్ కూడా..
గడ్డం ఉన్న పురుషులు మరింత ఆకర్షణీయంగా, మెచ్యూర్‌గా కనిపిస్తారని చాలా మంది భావిస్తారు. దీంతో వ్యక్తిత్వంలో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుందని చెబుతున్నారు. గడ్డం పెట్టుకునే వారు వయస్సు తగ్గినట్లు కనిపించే అవకాశముంది.
చివరగా ఒక్క విషయం..
గడ్డం పెంచుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దాన్ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. సరైన శుభ్రత పాటించకపోతే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రెగ్యులర్‌గా క్లీన్ చేసుకోవడం, ట్రిమ్ చేయడం అవసరం.
