Telangana: తెలంగాణకు కేంద్రం అదిరిపోయే న్యూస్.. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్.. త్వరలోనే పనులు..
తెలంగాణకు కేంద్రం శుభవార్త అందించింది. కొత్త రైల్వే లైన్‌కు ఆమోదముద్ర వేసింది. మణుగూరు-రామగుండం మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మించనుంది. ఐదేళ్లల్లోనే దీనిని పూర్త చేయాలనే డెడ్ లైన్ పెట్టుకుంది. ఇది పూర్తయితే భద్రచలం, రామగుండం వంటి ప్రాంతాలకు సులువుగా చేరుకోవచ్చు.

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రానికి మరో కొత్త రైల్వే లైన్ మోదీ సర్కార్ మంజూరు చేసింది. మణుగూరు-రామగుండం మధ్య కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. దీనిని రూ.5818.45 కోట్లతో నిర్మించనుండగా.. పీపీపీ పద్దతితో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంత ఈ ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. ఈ రైల్వే లైన్ పొడవు 207.8 కిలోమీటర్లు ఉంటుంది. ఇది పూర్తైతే స్థానిక ప్రాంతాల ప్రజలకు రైల్వే సౌకర్యం అందుబాటులోకి రావడంతో పాటు ప్రయాణ సమయం తగ్గనుంది. మేడారం జాతరకు వెళ్లేవారికి ఈ రైల్వే లైన్‌తో మరింత కనెక్టివిటీ లభించనుంది.
మేడారం మీదుగా లైన్..
ఈ కొత్త రైల్వే లైన్ మంథని, భూపాలపల్లి, మేడారం, తాడ్వాయి. గోపాలరావుపేట మీదుగా వెళుతుంది. ఇది పూర్తయితే మణుగూరు-రామగుండం మధ్య దాదాపు 90 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మణుగూరు నుంచి రామగుండం వెళ్లేందుకు భద్రాలచం, కాజీపేట మీదుగా వెళ్లాల్సి వస్తోంది. కొత్త లైన్ పూర్తయితే ప్రయాణ సమయం తగ్గనుంది. ఇక ములుగు, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని మారుమల గిరిజన ప్రాంతాలకు రైల్వే సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇక మేడారం, భద్రాచలం లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు కూడా మరింత సులువవుతుంది. ప్రయాణికులతో పాటు సరుకు రవాణా, ఖనిజాలు, ఎరువుల, బొగ్గు వంటి సరుకు రవాణాకు కూడా కీలకం కానుంది. త్వరలో ఈ కొత్త రైల్వే లైన్ పనులు చేపట్టనున్నారు. తొలి ఏడాదిలో భూసేకరణ ప్రక్రియ చేపట్టనుండగా.. ఆ తర్వాత నాలుగేళ్లల్లో ప్రాజెక్ట్ పూర్తి చేయనున్నారు.
పీపీపీ మోడల్‌లో నిర్మాణం
ఇక త్వరలోనే టెండర్లను కూడా రైల్వేశాఖ ఆహ్వానించనుంది. అనంతరం పీపీపీ మోడల్‌ను ఖరారు చేసి పనులు ప్రారంభించనుంది. డీపీఆర్, భూసేకరణ, అనుమతులు వంటి పనులను రైల్వేశాఖ చేపట్టనుండగా.. నిర్మాణం, నిధుల సమీకరణ వంటి పనులను ప్రైవేట్ సంస్థకు అప్పగించనున్నారు. ఈ రైల్వే లైన్ పూర్తయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు పెద్ద వరంగా మారనుంది. జిల్లాలోని గిరిజన ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. భద్రాచలం నుంచి రామగుండంకు త్వరగా చేసుకోవచ్చు. అటు తెలంగాణలో అనేక రైల్వే లైన్లను కొత్తగా చేపడుతున్నారు.
