Kavya Maran : సన్‌రైజర్స్ కావ్య మారన్‌ను పెళ్లాడబోతున్న రాక్‌స్టార్ అనిరుధ్.. సీన్‌లోకి రజనీకాంత్ ?
Kavya Maran : సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, ఎస్‌ఆర్‌హెచ్ సీఈఓ కావ్య మారన్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారాయి. అనిరుధ్, కావ్య మారన్ మధ్య ఏదో నడుస్తోందనే పుకార్లు ఈరోజు వచ్చినవి కావు.

Kavya Maran : సంగీత ప్రపంచంలో తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తున్న రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్, ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈఓ కావ్య మారన్ త్వరలోనే వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారనే వార్త టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు క్రికెట్ సర్కిల్స్‌లో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వీరిద్దరి రిలేషన్‌షిప్,పెళ్లి గురించి అనేక రకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తాజా కోలీవుడ్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. వీరిద్దరూ ఈ ఏడాది (2026) ద్వితీయార్థంలో పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని, త్వరలోనే ఇరు కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి.
అసలు లింక్ ఎక్కడ కుదిరింది?
అనిరుధ్, కావ్య మారన్ మధ్య ఏదో నడుస్తోందనే పుకార్లు ఈరోజు వచ్చినవి కావు. గత ఏడాది జూన్ నుంచే వీరిద్దరి డేటింగ్ రూమర్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయిన ఎక్స్, రెడ్డిట్‌లలో హల్‌చల్ చేస్తున్నాయి. వీరిద్దరూ విదేశాల్లోని లాస్ వెగాస్‌లో చెట్టాపట్టాలేసుకుని తిరిగారని, అక్కడ డిన్నర్ డేట్‌లలో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు వైరల్ అయ్యాయని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. దీనికి తోడు కావ్య మారన్ తండ్రి, మీడియా మొఘల్ కళానిధి మారన్‌కు చెందిన సన్ పిక్చర్స్ బ్యానర్‌లో అనిరుధ్ వరుసగా పెద్ద సినిమాలకు మ్యూజిక్ అందిస్తుండటం.. ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది.
సీన్‌లోకి సూపర్ స్టార్ రజనీకాంత్
సోషల్ మీడియాలో వినిపిస్తున్న అత్యంత క్రేజీ లీక్ ఏంటంటే.. అనిరుధ్ రవిచందర్‌కు వరుసకు మావయ్య అయిన సూపర్ స్టార్ రజనీకాంత్, ఈ పెళ్లి సంబంధం కోసం స్వయంగా రంగంలోకి దిగారని టాక్ నడుస్తోంది. రజనీకాంత్ స్వయంగా కళానిధి మారన్‌తో మాట్లాడి ఈ జంటను ఆశీర్వదించాల్సిందిగా కోరారని, రెండు వైపులా ఉన్న పెద్దలు పెళ్లికి దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తమిళ మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయాలపై సన్ నెట్‌వర్క్ కానీ, అనిరుధ్ కుటుంబ సభ్యులు కానీ ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రెస్ నోట్ విడుదల చేయలేదు.
విలేకరి ప్రశ్నకు అనిరుధ్ అదిరిపోయే రియాక్షన్
పెళ్లి వార్తలు పీక్స్‌కు చేరిన తరుణంలో.. ఇటీవలే ఒక పబ్లిక్ ఈవెంట్‌లో అనిరుధ్‌కు మీడియా నుండి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ఒక రిపోర్టర్ పేరు ఎత్తకుండా.. “సార్, త్వరగా పెళ్లి పిలుపు ఇవ్వండి” అని అనగా, అనిరుధ్ నవ్వుతూ తమిళంలో “ఇదు వేరా?” (మళ్లీ ఇదేనా?) అంటూ సింపుల్‌గా దాటవేశారు. గతంలో కూడా ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా “మ్యారేజ్ ఆ? లోల్.. కాస్త రూమర్స్ ఆపండి బాసూ” అంటూ కొట్టిపారేశారు. అటు కావ్య మారన్ కానీ, మారన్ ఫ్యామిలీ కానీ ఈ పుకార్లపై ఎప్పుడూ స్పందించకుండా పూర్తిగా సైలెంట్‌గా ఉంటూ వస్తున్నారు.
కెరీర్‌లో ఫుల్ బిజీగా లవ్ బర్డ్స్
ప్రస్తుతం ఈ ఇద్దరు సెలబ్రిటీలు తమ తమ కెరీర్‌లపైనే పూర్తి ఫోకస్ పెట్టారు. అనిరుధ్ ప్రస్తుతం ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్‌గా.. జైలర్ 2, జననాయగన్, షారూఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్ వంటి భారీ పాన్ ఇండియా సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. మరోవైపు, కావ్య మారన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ పనులతో పాటు, ఇటీవల సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఈస్టర్న్ కేప్ టీమ్ వరుసగా టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించి బిజినెస్ ఉమెన్‌గా బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ జంట నిజంగానే పెళ్లి పీటలు ఎక్కుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
