ఆడవాళ్ల నెట్‌వర్క్ చాలా పెద్దది. చుట్టుపక్కలవాళ్లు, బంధువులు, స్నేహితులు, వాకింగ్ పరిచయాలు.. ఇలా చాలానే! కొత్త పరిచయాలన్నీ ప్రారంభమయ్యేది మధ్యాహ్నం, సాయంకాలం చాయ్‌తోనే
TV9 Telugu
ఆ సమయంలో పిట్టగోడలు, మెట్లు, గార్డెన్.. ప్రతిదీ మీటింగ్ పాయింటే. ఆ వేళలో పక్కింటామె చీర దగ్గర్నుంచి ప్రపంచ వింతలవరకూ జరిగే సంభాషణలెన్ననీ. దొరికే చిన్న చిన్న ఆనందాలూ చాలానే! అంతేనా? కప్పు పూర్తయ్యేలోగా సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి. సలహాలు వెల్లువెత్తుతాయి. చిరునవ్వులు మారుమోగుతాయి
TV9 Telugu
అందుకే టీ సమయం ఆడవాళ్లకో సరదా సమయం, సపోర్ట్ సిస్టమ్. కాబట్టే, ఆ వేళ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఆఫీసులోనూ ఆమెను పని నుంచి కాస్త దూరం జరిపేదీ టీనే!
TV9 Telugu
గంటలకొద్దీ సాగే పని ప్రయాణానికి కామా పెడుతుంది ఇది. పాజ్ బటన్ నొక్కి.. ఒత్తిడి, తలనొప్పులను తరుముతుంది. అలాగని అన్ని చాయ్‌లూ ఒకటేనంటే ససేమిరా అనాల్సిందే
TV9 Telugu
ఒకేరకంగా చేయనీ.. ఒకే బ్రాండ్ పొడినే వాడనీ.. దీనిలోనూ ఆమెదైన ముద్ర ఉంటుంది. నిమ్మ, అల్లం, యాలకులు.. ఒక్కొక్కరిదీ ఒక్కో రెసిపీ. అమ్మ చేతిదో రుచి. బామ్మ నేర్పిందొకటి
TV9 Telugu
తరతరాల సంప్రదాయాల్నీ మోస్తూ మరో తరానికి అందిస్తుంది. కాబట్టే, వేడుకలు, పండుగల్లో అందరూ కలిసినప్పుడు దీనిపై తన చేతి టీ అయితే... అంటూ చర్చ నడుస్తూ ఉంటుంది
TV9 Telugu
చాలా తేలికైన తయారీ. కొద్దిమొత్తంలో చేసేదే! కానీ ఆమెకు మాత్రం ఇది విరామానికి చిహ్నం. బాధవనీ, ఆనందమవనీ ఆమెకు అండగా నిలిచే నేస్తం. ఎదుటివారికి కప్పు టీని అందివ్వడం ఆప్యాయతకీ, అభిమానానికీ సూచిక
TV9 Telugu
జ్ఞాపకాలను పోగేసుకునే సమయం. కాబట్టే, చెమటలు చిందే వేసవి అవనీ.. వణికించే చలికాలం కానీ.. చిటపట చినుకుల వేళే అవ్వనీ.. ఆమె నుంచి వేరు చేయలేని ప్రేమ.. ఈ టీ! ఎందుకంటే భారతీయ మహిళకు టీ ఒక పానీయం కాదు.. జీవితాన్ని ఆస్వాదించే ఓ మార్గం