వంట చేసేటప్పుడు మీరూ టమాటాలు ఇలా శుభ్రం చేస్తున్నారు?
21 May 2026
TV9 Telugu
TV9 Telugu
రసం, సాంబార్, పప్పు, ఉప్మా, చికెన్... ఇలా ఏది వండాలన్నా మనకి ముందు గుర్తొచ్చేవి టమాటాలే.. ఇది వంటకి రుచినే కాదు, మనకి ఆరోగ్యాన్నీ అందిస్తాయి
TV9 Telugu
కూరల్లో రుచి, గ్రేవీ కోసం టామాటా వాడడం మనకు అలవాటే. వీటిలో ఫోలేట్, పొటాషియం, విటమిన్ సి, కె వంటి సూక్ష్మ పోషకాలు ఎక్కువ
TV9 Telugu
దీన్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు, మెదడుకు మేలు చేస్తాయి. అంతేకాదు, కణాలు దెబ్బతినకుండా కాపాడి, క్యాన్సర్ ముప్పుని తగ్గిస్తాయి
TV9 Telugu
టైప్-2 డయాబీటీస్‌ను తగ్గించి, రక్తపోటుని అదుపులో ఉంచుతాయని అధ్యయనాలూ చెబుతున్నాయి. మరి ఇన్ని ప్రయోజనాలున్న ఈ టొమాటోలను పిల్లలకు లంచ్ బాక్స్ ఆలస్యం అవుతుందనో, ఆఫీస్‌కి లేట్ అవుతుందనో కంగారుగా కడిగి వండేస్తాం
TV9 Telugu
కానీ, ఇలా చేయకూడదు అంటున్నారు నిపుణులు. మిగిలిన కాయగూరలతో పోలిస్తే టొమాటోపై ఉండే తొక్క పలుచగా సున్నితంగా ఉంటుంది
TV9 Telugu
దీనివల్ల సాగు సమయంలో తెగులు నివారణకు చల్లే రసాయనాలు దానిమీద అతుక్కుంటాయి. సరిగ్గా శుభ్రం చేయకపోతే మన కడుపులోకి వెళ్లే ప్రమాదం ఉంది
TV9 Telugu
అందుకే వండటానికి ముందు ఉప్పు లేదా బేకింగ్ సోడా, వినెగర్ కలిపిన నీటిలో ఓ పావుగంట ఉంచి ఆపై మంచినీటితో శుభ్రంగా కడగాలి. అప్పుడే వాటిపై పేరుకున్న దుమ్మూధూళి, పురుగుమందుల అవశేషాలు తొలగిపోతాయి
TV9 Telugu
అందుకే కూరగాయల్లో కలిపి వండుతారో, కూర, పచ్చడి చేస్తారో టొమాటోని అయితే రోజూ ఇంట్లోవాళ్ల ఒంట్లోకి పంపండి. అయితే వండే ముందు శుభ్రంగా కడగటం మాత్రం మార్చిపోకండీ..!