AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma : హిట్‌మ్యాన్ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సీరియస్ డౌట్స్.. రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?

Rohit Sharma : రోహిత్ శర్మ ఫిట్‌నెస్ సమస్యల కారణంగా 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడటం కష్టంగా మారినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌లో అతడి ఎంపికపై బీసీసీఐ షరతులు విధించింది.దాదాపు 40 ఏళ్లకు చేరువవుతున్న రోహిత్.. 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఫీల్డింగ్ భారానికి తట్టుకోలేకపోతున్నాడని భావించింది.

Rohit Sharma : హిట్‌మ్యాన్  ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సీరియస్ డౌట్స్.. రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?
Rohit Sharma
Rakesh
|

Updated on: May 21, 2026 | 3:08 PM

Share

Rohit Sharma : హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కు అస్సలు జీర్ణించుకోలేని ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఆడటంపై ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకం నెలకొంది. త్వరలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు రోహిత్‌ను ఎంపిక చేసినప్పటికీ, అది కేవలం ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే అనే షరతుపైనే జరిగిందని బీసీసీఐ వర్గాల సమాచారం. దాదాపు 40 ఏళ్లకు చేరువవుతున్న రోహిత్.. 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఫీల్డింగ్ భారానికి తట్టుకోలేకపోతున్నాడని, అందువల్ల 2027 వరల్డ్ కప్ ప్లాన్స్ నుంచి అతడిని పక్కనబెట్టే యోచనలో సెలక్టర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

మీడియా నివేదికల ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ జట్టును ప్రకటించే ముందే చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ.. రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై సుదీర్ఘంగా చర్చించింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన రోహిత్, హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా సగం మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ ఉండటం వల్ల రోహిత్ కేవలం బ్యాటింగ్ చేసి తప్పుకున్నాడు. కానీ వన్డే క్రికెట్‌లో అలాంటి రూల్స్ ఉండవు. ఒక ప్లేయర్ కచ్చితంగా 50 ఓవర్ల పాటు గ్రౌండ్ లో ఫీల్డింగ్ చేయాల్సి ఉంటుంది. దాదాపు 39 ఏళ్ల వయసున్న రోహిత్ బాడీ ఇంతటి ఒత్తిడిని తట్టుకోలేదని బీసీసీఐలోని ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.

ఇన్నాళ్లూ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కెరీర్‌ను ఒకేలా చూసిన బీసీసీఐ, టీమ్ మేనేజ్‌మెంట్.. ఇప్పుడు ఆ ఇద్దరినీ వేర్వేరుగా చూడాలని డిసైడ్ అయ్యింది. విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ లెవెల్స్ దేశంలోనే అత్యుత్తమంగా ఉన్నాయని, కానీ రోహిత్ విషయంలో అలా లేదని స్పష్టం చేసింది. దీనికి తోడు, 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తప్పుకున్నాక.. అతను గతంలో ఆడినట్లు అల్ట్రా అగ్రెసివ్ ఓపెనింగ్ బ్యాటింగ్ స్టైల్‌ను ప్రదర్శించడం లేదని, డిఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్ళిపోవడం కూడా మేనేజ్‌మెంట్‌కు నచ్చడం లేదని తెలుస్తోంది. రాబోయే ఇంగ్లాండ్ పర్యటన రోహిత్ వన్డే కెరీర్‌కు చివరిది కానుందని సీనియర్ జర్నలిస్ట్ జీఎస్ వివేక్ రిపోర్ట్ చేశారు.

ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే జూన్ 6 నుండి ప్రారంభం కాబోయే ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు బీసీసీఐ సరికొత్త ప్రయోగాలు చేస్తోంది. ఈ సిరీస్‌కు శుభ్‌మన్ గిల్‎ను వన్డే కెప్టెన్‌గా, శ్రేయస్ అయ్యర్‌ను వైస్ కెప్టెన్‌గా ప్రకటించారు. రోహిత్ శర్మ ఒకవేళ ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ అవ్వకపోతే.. అతడి స్థానంలో ఓపెనర్‌గా, బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఉపయోగపడేలా ఇషాన్ కిషన్‎ను జట్టులోకి తీసుకున్నారు. యశస్వి జైస్వాల్‌తో పాటు మరో అదనపు ఓపెనర్‌ను వరల్డ్ కప్ కోసం ఇప్పుడే గ్రూమ్ చేయాలని సెలక్టర్లు ఫిక్స్ అయ్యారు.

భవిష్యత్తు వన్డే జట్టును నిర్మించాలనే ప్లాన్‌లో భాగంగా.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కోసం బీసీసీఐ బౌలింగ్ విభాగంలో భారీ మార్పులు చేసింది. ఐపీఎల్, దేశీ టోర్నీల్లో సత్తా చాటిన ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ లకు తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కింది. వీరితో పాటు అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డిలు బౌలింగ్ భారాన్ని మోయనున్నారు. సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్ నుంచి పూర్తిగా విశ్రాంతి కల్పించారు.

ఆప్ఘనిస్తాన్ సిరీస్ షెడ్యూల్

ఏకైక టెస్ట్ మ్యాచ్ – న్యూ చండీగఢ్ – 06 జూన్ 2026, ఉదయం 9:30 గంటలకు

తొలి వన్డే – ధర్మశాల – 13 జూన్ 2026, మధ్యాహ్నం 1:30 గంటలకు

రెండో వన్డే – లక్నో – 17 జూన్ 2026, మధ్యాహ్నం 1:30 గంటలకు

మూడో వన్డే – చెన్నై – 20 జూన్ 2026, మధ్యాహ్నం 1:30 గంటలకు

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us