ఖాకీచకుడు.. 4సార్లు అత్యాచారం చేశాడు.. మహిళా డాక్టర్ అరచేతిపై నోట్.. చివరకు
ఎస్‌ఐ లైంగిక వేధింపులతో లేడీ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహారాష్ట్రను కుదిపేస్తోంది. తనపై ఎస్‌ఐ గోపాల్ బదానే అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ చేతిపై సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు డాక్టర్. సతారాలో జరిగిన ఈ దారుణంపై ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. అంతేకాకుండా ఎస్ఐను సస్పెండ్ చేసింది.

మహారాష్ట్రలోని సతారాలో ఓ లేడీ డాక్టర్ ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఎస్‌ఐ గోపాల్ బదానే తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, అతడి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు చేతిపై సూసైడ్ నోట్ రాసి ఆమె ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం రేపింది. గురువారం రాత్రి ఆమె ఫల్టాన్‌లోని ఓ హోటల్ గదిలో ఉరికి వేలాడుతూ కన్పించారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సతారా పోలీసు విభాగానికి చెందిన ఇద్దరు పోలీసులు గత ఐదు నెలలుగా తనను వేధిస్తున్నారని మృతురాలు ఆ నోట్‌లో పేర్కొన్నారు. ఎస్సై గోపాల్ బదానే పలుమార్లు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని, మరో పోలీసు ప్రశాంత్ బంకర్ మానసికంగా వేధింపులకు గురిచేశాడని ఆమె ఆరోపించారు.
దీంతో ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. సూసైడ్ నోట్‌లో పేర్కొన్న ఆరోపణల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇదిలాఉంటే.. ఎస్‌ఐ గోపాల్‌బదానేను మహారాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే వైద్యురాలి మృతికి కారణమైన గోపాల్‌ను అరెస్ట్ చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
మహారాష్ట్ర సీఎం ఏమన్నారంటే..
లేడీ డాక్టర్ ఆత్మహత్యపై సమగ్రంగా దర్యాప్తు చేస్తామని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తెలిపారు. దోషులను విడిచిపెట్టేయ ప్రసక్తే లేదన్నారు. ఇప్పటికే ఆరోపణలు వచ్చిన అధికారిని సస్పెండ్ చేసినట్టు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




