AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleeper Buses: స్లీపర్ బస్సులు అంత డేంజరా? డిజైన్లోనే లోపం ఉందా?

బస్ యాక్సిడెంట్ జరిగితే.. దానికి నిప్పంటుకుంటే.. సజీవ దహనం జరక్కుండా ప్రయాణికులు బయటపడ్డ ఘటనలే లేవు దాదాపుగా. అప్పట్లో పాలెం బస్సు ప్రమాదమే గానీ, లేటెస్ట్ కర్నూలు యాక్సిడెంటే గాని, మొన్నామధ్య రాజస్తాన్‌లో గానీ. ఎందుకని? స్లీపర్ బస్సుల్లోంచి బయటకురావడం అంత కష్టమా? బ్రీఫ్‌గా చెప్పాలంటే... గాలి పీల్చుకోకుండా ఓ 30 సెకన్లకు మించి ఉండలేరు ఇప్పుడున్న అనారోగ్యాలరీత్యా. అలాంటిది.. మసిబారిన నల్లటి పొగను 30 సెకన్లకు మించి పీల్చితే.. ఖతం. ఆటోమేటిక్‌గా స్పృహ కోల్పోతారు. మైకం కమ్మేస్తుంటే ఎమర్జెన్సీ డోర్స్ ఎక్కడున్నాయో వెతకలేరు. అద్దాలు పగలగొట్టేంత శక్తి ఉండదు. పైగా ఒళ్లు దహించేసేంత వేడి. ఒకరిద్దరు అద్దాలు పగలగొట్టి బయటపడుతుండడం కళ్లకు కనిపిస్తూనే ఉంటుంది. కానీ, ఒంట్లోని శక్తినంతా కూడదీసుకున్నా సరే కదల్లేని నిస్సహాయ స్థితి కమ్మేస్తుంది. కావాలంటే చూడండి.. కర్నూలు యాక్సిడెంట్‌లో 20-30 ఏళ్ల వయసున్న వాళ్లు కూడా చనిపోయారు. స్పృహతప్పి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు.. బతికుండగానే శరీరం కాలిపోతూ ఉంటుంది. ఇదంతా జరిగేది జస్ట్ స్పాన్ ఆఫ్ మినిట్స్‌లో. నిమిషాల్లో బుగ్గి అయిందంటుంటారు చూశారా... ఎగ్జాక్ట్‌గా ఇలాగే జరిగింది కర్నూలు బస్ యాక్సిడెంట్‌లో. 19మంది సజీవ దహనం అయ్యారు. అందుకే, మామూలు బస్సుల కన్నా స్లీపర్ బస్ మరింత ప్రమాదకారి. దీనికి కారణం డ్రైవర్, ట్రావెల్స్ నిర్లక్ష్యం ఒక్కటే కాదు.. అధికారులది కూడా. చాలా దేశాలు ఈ స్లీపర్ బస్సులను బ్యాన్ చేశాయి. అవి ఎంత డేంజరో తెలుసుకున్నాయి కాబట్టి. మరి ఇండియాలో ఎందుకని నడుస్తున్నాయి? అసలు స్లీపర్ బస్సులే ఎందుకని యమ డేంజర్? కంప్లీట్ డిటైల్స్...

Sleeper Buses: స్లీపర్ బస్సులు అంత డేంజరా? డిజైన్లోనే లోపం ఉందా?
India Sleeper Bus Accidents
Ram Naramaneni
|

Updated on: Oct 24, 2025 | 9:54 PM

Share

జర్మనీ, చైనా బ్యాన్ చేసిన ఈ స్లీపర్‌ బస్సులను ఇండియాలో ఎందుకు నడుపుతున్నారనే ప్రశ్న ప్రమాదం జరిగినప్పటి నుంచి వినిపిస్తూనే ఉంది. అసలు చైనా ఎందుకని బ్యాన్ చేసింది వీటిని? టెక్నికల్‌గా, మాన్యువల్‌గా.. ప్రధానంగా నాలుగు మిస్టేక్స్ కనిపించాయి కాబట్టి. అది కూడా ప్రమాదాలు జరిగిన తరువాతనే స్లీపర్ బస్సు ఎంత ప్రమాదకారో అర్ధమైంది కాబట్టి. ఆ ప్రమాదాల్లో 256 మంది చనిపోయారు కాబట్టి. మరి.. ఇండియాలోనూ వంద మంది వరకు చనిపోయారు ఈ స్లీపర్ బస్ యాక్సిడెంట్‌లో. ఇక్కడెందుకని బ్యాన్ చేయడం లేదు? ప్రమాదం ఎలా జరిగిందో చెప్పుకుంటేనే.. ఈ బస్సులు ఎందుకంత ప్రమాదకారో తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు బయల్దేరిన బస్సు.. సరిగ్గా తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో రోడ్డు మీద బైక్‌పైకి ఎక్కేసింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడని అనుమానించడానికి ఇదో ఆధారం. ఎందుకంటే.. బైక్‌ను ఢీకొట్టినా సరే బస్సును వెంటనే ఆపలేదంటున్నారు ప్రత్యక్షసాక్షులు. కొంతదూరం లాక్కొనిపోవడం, బస్సు కిందకి బైక్ వెళ్లిపోవడం, నిప్పురాజుకుని బస్సుకు అంటుకోవడం జరిగింది. (function(v,d,o,ai){ ai=d.createElement("script"); ai.defer=true; ai.async=true; ai.src=v.location.protocol+o; d.head.appendChild(ai); })(window, document, "//a.vdo.ai/core/v-tv9telugu-v0/vdo.ai.js"); బస్సు ముందు భాగంలో నిప్పు అంటుకునే సరికి.. ఎలక్ట్రికల్ సిస్టమ్ డ్యామేజ్ అయింది. డోర్స్ ఓపెన్ అయ్యే సిస్టమ్ మొత్తం జామ్ అయింది. ఓవైపు మంటలు చెలరేగుతుండడంతో క్యాబిన్ నుంచి డ్రైవర్ పరారయ్యాడు. సో, ముందు నుంచి దిగే ఛాన్సే లేదు. పోనీ మరో దారి ఉందా అంటే.. అదెక్కడుందో ప్రయాణికులకు తెలీదు. పైగా గాఢనిద్రలో ఉండే సమయం. బస్...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి