కట్టుకున్న భార్యను కడతేర్చాడు.. ఆపై ఐదుగురు మహిళలకు ఒకటే మెసేజ్.. చూసి పోలీసులు షాక్
నీ కోసమే.. నా భార్యను చంపేశా. ఇది సినిమా టైటిల్ కాదూ.. ఓ డాక్టర్ తన లవర్‌కి పంపిన మెసేజ్. బెంగళూరులో డాక్టర్ కృతిక రెడ్డి మరణం అనంతరం.. దాదాపు నాలుగు వారాల తర్వాత ఐదుగురు మహిళలకు ఇదే సందేశాన్ని పంపించాడు భర్త మహేంద్ర రెడ్డి.

నీ కోసమే.. నా భార్యను చంపేశా. ఇది సినిమా టైటిల్ కాదూ.. ఓ డాక్టర్ తన లవర్‌కి పంపిన మెసేజ్. బెంగళూరులో డాక్టర్ కృతిక రెడ్డి మరణం అనంతరం.. దాదాపు నాలుగు వారాల తర్వాత ఐదుగురు మహిళలకు ఇదే సందేశాన్ని పంపించాడు భర్త మహేంద్ర రెడ్డి. ఓ డిజిటల్ యాప్‌లో ఈ మెసేజ్ పంపినట్టు మొబైల్ డేటా విశ్లేషణలో తేలింది. ఈ విషయం తెలుసుకుని కృతిక కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ బిడ్డను చంపిన డాక్టర్ మహేంద్రను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
బెంగళూరు డాక్టర్ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్ర రెడ్డి జనరల్ సర్జన్. స్కిన్ స్పెషలిస్ట్ అయిన తన భార్య డాక్టర్ కృతిక రెడ్డిని అనస్థీషియా డ్రగ్‌తో హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమె చనిపోయాక మహేంద్ర ఐదుగురు మహిళలకు ఓ భయంకరమైన సందేశాన్ని పంపినట్లు దర్యాప్తులో తేలింది. వాళ్లందరికీ.. నీ కోసమే నా భార్యను చంపానంటూ మహేంద్ర మెసేజీలు పంపించినట్లు గుర్తించారు.
I KILLED MY WIFE FOR YOU అనే సందేశాన్ని సాధారణ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లో కాకుండా ఓ డిజిటల్ చెల్లింపు యాప్‌లోని ట్రాన్సాక్షన్స్ నోట్స్ సెక్షన్‌లో పంపించాడు. ఈ సందేశాన్ని అందుకున్న వాళ్లలో గతంలో మహేంద్ర లవ్ ప్రపోజల్‌ను తిరస్కరించిన మెడికల్ ప్రొఫెషనల్ కూడా ఉన్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న అతని మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ డేటాను ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించగా ఈ విషయాలు బయటపడ్డాయి. భార్య హత్య తర్వాత పాత రిలేషన్లను కొనసాగించడానికి చాలారకాల ప్రయత్నాలు మహేంద్ర చేసినట్టు తేలింది. అన్ని కోణాల్లో ఆరాతీస్తున్న పోలీసులకు ముందు ముందు ఇంకెన్ని దుర్మార్గాలు బయటపడతాయో చూడాలి.




