Ram Leela: హర్యానా ప్రభుత్వం మహత్తర కార్యక్రమం.. 11లక్షల మంది చిన్నారుల రామ్‌లీల ప్రదర్శన .. ఎప్పుడంటే
అక్టోబర్ 16న ప్రతి పాఠశాలలో నిపున్ మేళా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బాలరామాయణాన్ని ప్రదర్శించనున్నారు. బాలరామాయణ ప్రదర్శన అంశంపై చిన్నారుల తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేసేందుకు విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మొత్తం కార్యక్రమం ప్రాథమిక అక్షరాస్యత, విజ్ఞానానికి అంకితం చేయనున్నామని విద్యాశాఖ ప్రకటించింది.

హర్యానాలోని పాఠశాల విద్యార్థులు మహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. హిందీ భాషపై పట్టును బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రంలోని 8400 పాఠశాలల్లోని స్టూడెంట్స్ అక్టోబర్ 5 నుంచి 15వ తేదీలోపు బలరామాయణాన్ని అభ్యాసం చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలోని దాదాపు 11 లక్షల మంది చిన్నారులు ఈ ప్రక్రియలో పాలుపంచుకోనున్నారు. అనంతరం అక్టోబర్ 16న ప్రతి పాఠశాలలో నిపున్ మేళా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బాలరామాయణాన్ని ప్రదర్శించనున్నారు.
బాలరామాయణ ప్రదర్శన అంశంపై చిన్నారుల తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేసేందుకు విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మొత్తం కార్యక్రమం ప్రాథమిక అక్షరాస్యత, విజ్ఞానానికి అంకితం చేయనున్నామని విద్యాశాఖ ప్రకటించింది. మన పురాతన ఇతిహాసాలను పురాణ పురుషుల గురించి నాటకాలు ద్వారా పిల్లలకు తెలియజేయడం పిల్లల్లో భాషాభివృద్ధికి దోహదపడుతుందని విద్యాశాఖ తెలిపింది. బాల రామాయణంలోని పాత్రల సంభాషణలు మాట్లాడటం, చదవడం, రాయడంతో పిల్లలందరిలో ఉచ్చారణను మెరుగుపరుస్తుందని వెల్లడించారు.
గత ఏడాది కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహించామని ఆ తర్వాత సానుకూల ప్రభావాలు కనిపించాయని విద్యాశాఖ పేర్కొంది. NCERTలో 6వ తరగతి హిందీ పుస్తకంలో బలరామాయణ కథని పాఠ్యంశంగా బోధిస్తున్నారు. ఈ కథా నేపధ్యాన్ని అక్టోబర్‌లో పాఠశాల స్థాయిలో నాటకంగా స్టూడెంట్స్ ప్రదర్శించనున్నారు. చిన్న తరగతుల్లో చదివే పిల్లల్లో హిందీ సబ్జెక్ట్ పట్ల ఆసక్తి , అవగాహన పెంపొందించడమే తమ లక్ష్యమని తెలిపారు.
విద్యాశాఖ తన ఉత్తర్వుల్లో ప్రదర్శించాల్సిన 5 సన్నివేశాలను పేర్కొంది. పాఠశాల తన ఆసక్తిని బట్టి ఏదైనా సన్నివేశాన్ని ఎంచుకోవచ్చు. దీని ఆధారంగా నాటకాన్ని ప్రదర్శించవచ్చు. ఏదైనా పాఠశాల ఇతర సన్నివేశాలను చేర్చాలనుకుంటే.. వారు 6వ తరగతిలోని పాఠ్యంశం నుంచి బాల రామాయణ కథ నుంచి సన్నివేశాలను ఎంచుకోవచ్చని పేర్కొన్నారు. స్టేజ్ మీద నాటకం ప్రదర్శించే చిన్నారులు ఎలాంటి దుస్తులు కొనుగోలు చేయనవసరం లేదని వెల్లడించారు. నాటకం కోసం స్టూడెంట్స్ కు కావాల్సిన దుస్తులు, సామగ్రిని పాఠశాల ద్వారానే అందించబడుతుందని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




