AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: బైక్‌ను ఢీకొట్టి.. బానట్‌పై పడిన వ్యక్తిని 1.5 కి.మీ లాక్కెళ్లిన కారు.. షాకింగ్‌ వీడియో..

Gujarat hit and run: మద్యం మత్తులో గుజరాత్‌ రోడ్లపై మరో వ్యక్తి రెచ్చిపోయాడు. ఫుల్‌గా తాగి కారు డ్రైవ్‌ చేస్తూ నడిరోడ్డుపై బీభత్సం సృష్టించాడు. హై స్పీడ్‌తో దూసుకొచ్చి ఒక బైక్‌ను ఢీకొట్టమే కాకుండా.. ఆబైక్‌పై ఉన్న వ్యక్తిని సుమారు కిలోమీటర్‌న్నర ఈడ్చుకెళ్లాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Watch: బైక్‌ను ఢీకొట్టి.. బానట్‌పై పడిన వ్యక్తిని 1.5 కి.మీ లాక్కెళ్లిన కారు.. షాకింగ్‌ వీడియో..
Gujarat Hit And Run
Anand T
|

Updated on: Oct 30, 2025 | 5:17 PM

Share

గుజరాత్‌లోని మహిసాగర్ జిల్లాలో జాతీయ రహదారి 48పై బుధవారం రాత్రి భయంకరమైన హిట్ అండ్ రన్ సంఘటన జరిగింది. ఫుల్‌గా మద్యం తాగి కారు నడిపిన ఒక ఉపాధ్యాయులు నడిరోడ్డుపై బీభత్సం సృష్టించాడు. వేగంగా దూసుకొచ్చి ఒక బైక్‌ను ఢీకొట్టాడు. అంతటితో ఆగకుండా.. కారు బానట్‌పై పడిన బైక్‌ను సుమారు కిలోమీటర్‌న్నర ఈడ్చుకెళ్లాడు.. ఈ సమయంలో కారు బానట్‌పై బైక్‌తో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలో మనం చూడవచ్చు.. కొద్ది దూరం వెళ్లిన తర్వాత అతను దానిపై నుంచి కిందపడిపోయాడు.

అది గమనించిన అటుగా వెళ్తున్న వారు కారు డ్రైవర్‌ను ఆపి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న బాకోర్ పోలీసులు కారు ఢీకొనడంతో గాయపడిన బైక్‌పై ఉన్న వ్యక్తిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడిన డ్రైవర్ మనీష్ పటేల్, అతని సోదరుడు మెహుల్ పటేల్‌లను అదుపులోకి తీసుకుని, కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని బాకోర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ప్రమాదంలో గాయపడిన ఇద్దరు బైక్‌పై ఉన్న వారిని 50 ఏళ్ల దినేష్‌భాయ్, 21 ఏళ్ల సునీల్‌గా పోలీసులు గుర్తించారు. వారిని చికిత్స కోసం లునావాడ సివిల్ హాస్పిటల్, గోద్రా సివిల్ హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావంలో ఆ ఉపాధ్యాయుడి తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి