బొమ్మ తుపాకీతో బెదిరించి, 17 మంది పిల్లలను బంధించిన దుండగుడు..!
ముంబైలో హైడ్రామా చోటు చేసుకుంది. RA స్టూడియోలో ఆడిషన్ కోసం వచ్చిన పిల్లలను రోహిత్ ఆర్య అనే వ్యక్తి బందీలుగా పట్టుకోవడం తీవ్ర కలకలం రేపింది. తాను కొన్ని ప్రశ్నలు సంధిస్తానని, వాటికి సమాధానం కావాలన్నాడు రోహిత్. తన ప్రశ్నలకు సమాధానం రాకపోతే పిల్లలతో పాటు తాను సజీవదహనం అవుతానని హెచ్చరించాడు.

ముంబైలో హైడ్రామా చోటు చేసుకుంది. RA స్టూడియోలో ఆడిషన్ కోసం వచ్చిన పిల్లలను రోహిత్ ఆర్య అనే వ్యక్తి బందీలుగా పట్టుకోవడం తీవ్ర కలకలం రేపింది. తాను కొన్ని ప్రశ్నలు సంధిస్తానని, వాటికి సమాధానం కావాలన్నాడు రోహిత్. తన ప్రశ్నలకు సమాధానం రాకపోతే పిల్లలతో పాటు తాను సజీవదహనం అవుతానని హెచ్చరించాడు. రోహిత్ ఆర్య అదే స్టూడియోలో పనిచేస్తునట్టు పోలీసులు గుర్తించారు.
పిల్లలను విడిపించడానికి పోలీసులు కమెండో ఆపరేషన్ చేపట్టారు. వివేక్‌ను సముదాయించి అదుపులోకి తీసుకున్నారు. ఎట్టకేలకు పిల్లలను రక్షించారు. రోహిత్ ఆర్య మానసిక పరిస్థితి బాగా లేదని గుర్తించారు. సంఘటనా స్థలంలో బొమ్మ తుపాకీతో పాటు కెమికల్ పౌడర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ముంబైలోని పోవై లో కేసు వెలుగులోకి వచ్చింది, ఇది తీవ్ర కలకలం రేపింది. చిత్రీకరణ ప్రాజెక్ట్ పేరుతో ఒక వ్యక్తి 17 మంది పిల్లలను స్టూడియోకి రప్పించి, వారిని బందీలుగా ఉంచాడు. పోలీసులు పిల్లలను సురక్షితంగా రక్షించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు జాయింట్ కమిషనర్ సత్యనారాయణ చౌదరి తెలిపారు.
పిల్లలను బందీలుగా తీసుకున్న తర్వాత నిందితుడు ఒక వీడియోను విడుదల చేశాడు. అందులో, “నేను రోహిత్ ఆర్య. ఆత్మహత్యకు బదులుగా, నేను ఒక పథకం వేసుకుని కొంతమంది పిల్లలను బందీలుగా తీసుకున్నాను. నా దగ్గర పెద్దగా డిమాండ్లు లేవు. నా దగ్గర కొన్ని సాధారణ డిమాండ్లు ఉన్నాయి… నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. నేను ఉగ్రవాదిని కాదు. పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడం లేదు. నేను ఈ పిల్లలను ఒక సాధారణ సంభాషణ కోసం బందీలుగా తీసుకున్నాను” అని చెప్పాడు.
గురువారం తెల్లవారుజామున 1:45 గంటలకు సంఘటన స్థలంలో ఎయిర్‌గన్, కొన్ని రసాయనాలు దొరికాయని తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. నిందితుడు ఒంటరిగా ఉన్నాడు. ఇందుకు సంబంధించి కారణం తెలుసుకోవడానికి వారు ప్రయత్నించారు. కానీ అతను మొండిగా ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గదిలో మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వారిలో ఒక వృద్ధుడు కూడా ఉన్నారని తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




