AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: టీటీఈ నంటూ ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు.. కట్‌చేస్తే.. ఇది పరిస్థితి

ఈజీ మనీ కోసం అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు జనాలను నుంచి డబ్బులు కాజేసేందుకు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇలానే తాజాగా ఒక వ్యక్తి టీటీఈ అవతారమొత్తం ట్రైన్‌లోని టికెట్‌ లేని ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. సరిగ్గా అదే టైమ్‌ ట్రైన్‌ ఎక్కి రైల్వే సిబ్బంది అతన్ని గుర్తించడంతో అసలు విషయం వెలుగు చూసింది. అతన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు ఆ వ్యక్తి నుంచి రూ.1650 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పూణే నుండి జమ్మూ తావికి వెళ్తున్న జీలం ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది.

Viral Video: టీటీఈ నంటూ ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు.. కట్‌చేస్తే.. ఇది పరిస్థితి
Viral Video
Anand T
|

Updated on: Oct 25, 2025 | 7:08 PM

Share

పూణే నుండి జమ్మూ తావికి వెళ్తున్న జీలం ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఒక వ్యక్తి రైల్వే సిబ్బందికి పట్టుబడిన ఘటన ఝాన్సీలో వెలుగు చూసింది. టికెట్ లేని ప్రయాణికుల నుండి డబ్బు వసూలు చేస్తుండగా.. ట్రైన్‌లోకి వచ్చిన టికెట్ తనిఖీ సిబ్బంది అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణలో, అతను ఇంతకు ముందు ఇలాంటి ఘటనలకు పాల్పడినట్టు ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు.. ఆ వ్యక్తి నుంచి రూ.1650 నగదు స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. పూణే నుండి జమ్మూ తావికి వెళ్తున్న జీలం ఎక్స్‌ప్రెస్ జనరల్ కోచ్‌లో ఒక వ్యక్తి ఎక్కడాడు. అయితే పండగ పూర్తైన సందర్భంగా జనరల్‌ బోగీలో చాలా మంది ప్రయాణికులు టికెట్‌ లేకుండా ఎక్కారు. ఇదే అదునుగా భావించిన ఆ వ్యక్తి తనను తాను టిటిఇగా చెప్పుకుంటూ ప్రయాణికుల నుండి డబ్బు వసూలు చేయడం స్టార్ట్ చేశారు. దీంతో అతనిపై అనుమానం వచ్చిన రైలులో ఉన్న ఒక ప్రయాణీకుడు అతన్ని డబ్బు వసూలు చేస్తున్న దృశ్యాలు రికార్డ్ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలు క్షణాల్లో వైరల్‌గా మారి రైల్వే అధికారుల దృష్టికి చేశాయి.

దీంతో రంగంలోకి దిగిన రైల్వే పోలీస్ ఫోర్స్‌, టికెట్‌ తనిఖీ సిబ్బంది ట్రైన్ గ్వాలియర్ చేరుకున్న తర్వాత ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ.1650 నగదును స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఇతను ఇంతకు ముందు కూడా రెండు సార్లు ఇలాంటి ఘటనలకు పాల్పడ్డట్టు ఒప్పుకున్నాడు.

వీడియో చూడండి..

View this post on Instagram

A post shared by Our Gwalior™ (@ourgwalior)

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?