షాపు ఓనర్‌కే మస్కా.. ఎంత సింపుల్‌గా బంగారం కొట్టేశారో చూస్తే షాక్..!
బంగారం ధరలు ప్రతి రోజు పెరుగుతూ.. ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనివల్ల అందరికీ బంగారం దొరకడం కష్టమవుతుంది. అయితే ఇటీవల, ఢిల్లీలోని లక్ష్మీ నగర్‌లోని ఒక నగల దుకాణం నుండి వచ్చిన CCTV ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఇద్దరు మహిళలు తెలివిగా బంగారు ఉంగరాన్ని దొంగిలించారు.

బంగారం ధరలు ప్రతి రోజు పెరుగుతూ.. ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనివల్ల అందరికీ బంగారం దొరకడం కష్టమవుతుంది. అయితే ఇటీవల, ఢిల్లీలోని లక్ష్మీ నగర్‌లోని ఒక నగల దుకాణం నుండి వచ్చిన CCTV ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఇద్దరు మహిళలు తెలివిగా బంగారు ఉంగరాన్ని దొంగిలించారు.
ఈ మొత్తం సంఘటనను చాలా తెలివిగా వ్యవహారించడంతో దుకాణదారుడు మొదట్లో ఏమీ తెలియలేదు. ఉంగరాలు కొంటున్నామని చెప్పి ఇద్దరు మహిళలు దుకాణానికి వచ్చారు. దుకాణదారుడు వారి ముందు ఉంగరాల పెట్టెను తెరిచి పెట్టడంతో, వారు చూస్తున్నట్లు నటించారు. దుకాణదారుడు ఏదో చూసుకోవడానికి వెనక్కి తిరిగాడు. అప్పుడే, వారిలో ఒక మహిళ నిజమైన బంగారు ఉంగరాన్ని దొంగలించి, నకిలీతో భర్తీ చేసింది.
ఇదంతా కొన్ని సెకన్లలోనే జరిగిపోయింది. ఆ మహిళ చాలా వేగంగా వ్యవహరించింది. సీసీటీవీ కెమెరాలు లేకపోతే ఎవరూ నమ్మేవారు కాదు. ఆమె మళ్ళీ ఉంగరాలను చూపించడం ప్రారంభించే వరకు దుకాణదారుడు గమనించలేదు. ఏమీ జరగనట్లుగా ఇద్దరు మహిళలు ప్రశాంతంగా అక్కడి నుంచి జారుకున్నారు. దుకాణదారుడు మరొక పెట్టె తీసుకోవడానికి తిరిగినప్పుడు, ఒక మహిళ నిజమైన ఉంగరాన్ని తన జేబులో పెట్టుకుని నకిలీ ఉంగరాన్ని కేసులో ఉంచుకుంది. దుకాణదారుడు తిరిగి వచ్చినప్పుడు, ప్రతిదీ సాధారణంగా కనిపించింది. కానీ తరువాత దుకాణంలోని CCTV ఫుటేజ్ చూసినప్పుడు అసలు నిజం బయటపడుతుంది.
ఈ 35 సెకన్ల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. @mktyaggi అనే యూజర్ ఈ వీడియోను X లో షేర్ చేస్తూ, “దొంగలు, మోసగాళ్ళు కూడా అద్భుతమైన టెక్నిక్‌లను కలిగి ఉన్నారు. వారు నిజమైన బంగారు ఉంగరాన్ని నకిలీతో భర్తీ చేశారు. కానీ CCTV అన్నింటినీ బంధించింది” అని రాశారు. ఈ పోస్ట్‌ను 150,000 సార్లు వీక్షించారు. వెయ్యి మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోకు వందలాది వ్యాఖ్యలు కూడా వచ్చాయి.
వీడియోను ఇక్కడ చూడండిః
कमाल की तकनीक रहती है चोरों और ठगों की भी…सोने की असली अंगूठी की जगह, नकली रख दी, लेकिन CCTV ने सब रिकॉर्ड कर लिया।📍लक्ष्मीनगर, दिल्ली pic.twitter.com/TpCRjrMYf8
— 𝙼𝚛 𝚃𝚢𝚊𝚐𝚒 (@mktyaggi) October 24, 2025
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
