AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali Celebrations: దీపావళి రోజు ఇక్కడ దీపాలు వెలిగించరు, టపాసులు కాల్చరు.. కారణం ఇదే..

దీపావళిని దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సంబరంగా జరుపుకుంటున్నారు. దీపావళి అనగానే మరకు గుర్తుకు వచ్చేవి కొత్త బట్టలు, పిండి వంటలు, లక్ష్మీదేవి పూజ, రకరకాల స్వీట్లు, డ్రైఫ్రూట్ గిఫ్ట్ బాక్సులు, టపాసుల మోతలు. ఈ సాంప్రదాయం చిన్న గ్రామాల నుంచి పెద్ద పట్టణాల వరకూ విస్తరించింది. పండక్కు నగరాల నుంచి ఇంటికి వెళ్లే వాళ్లు వీటిని ఇక్కడి నుంచే తీసుకొని వెళ్తున్నారు. తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, సన్నిహితులకు పంచి సరదాగా జరుపుకుంటున్నారు.

Diwali Celebrations: దీపావళి రోజు ఇక్కడ దీపాలు వెలిగించరు, టపాసులు కాల్చరు.. కారణం ఇదే..
Diwali Is Not Celebrate In Vadamugam Vellowed Bird Sanctuary Area In Erode District Of Tamil Nadu.
Srikar T
|

Updated on: Nov 12, 2023 | 9:53 PM

Share

దీపావళిని దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సంబరంగా జరుపుకుంటున్నారు. దీపావళి అనగానే మరకు గుర్తుకు వచ్చేవి కొత్త బట్టలు, పిండి వంటలు, లక్ష్మీదేవి పూజ, రకరకాల స్వీట్లు, డ్రైఫ్రూట్ గిఫ్ట్ బాక్సులు, టపాసుల మోతలు. ఈ సాంప్రదాయం చిన్న గ్రామాల నుంచి పెద్ద పట్టణాల వరకూ విస్తరించింది. పండక్కు నగరాల నుంచి ఇంటికి వెళ్లే వాళ్లు వీటిని ఇక్కడి నుంచే తీసుకొని వెళ్తున్నారు. తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, సన్నిహితులకు పంచి సరదాగా జరుపుకుంటున్నారు. అయితే ఒక ప్రాంతంలో టపాసుల మోత ఉండదు. దీపావళిని ఎలాంటి క్రాకర్స్ కాల్చకుండా నిశ్శబ్ధంగా జరుపుకుంటారు. దీపావళి అంటేనే బాంబుల మోత అని కొందరు భావిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఈ ఏడు గ్రామాలు ఆదర్శం అని చెప్పాలి. ఆ ప్రాంతాలేంటో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఏడు గ్రామాల ప్రజలు ఎలాంటి టపాసులు కాల్చకుండా నిశ్శబ్ధంగా దివాళీని జరుపుకుంటారు. దీంతో పాటూ ఎలాంటి దీపాలు వెలిగించకుండా జరుపుకోవడం విశేషం. దీనికి కారణం పర్యావరణం అనుకుంటే పొరబడినట్లే. ఈ ఏడు గ్రామాల్లో మధ్యలో పక్షులు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఈరోడ్‌కి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. దీనిపేరు వడముగం వెల్లోడ్ బర్డ్ సాంక్చుయరీగా పిలుస్తారు. దీనిని 1996లో 80 ఎకరాల్లో నిర్మించారు. ఇందులో వేలాది రకాల పక్షి జాతులు నివాసం ఉంటున్నాయి. ఇవి ఇతర ప్రాంతాల నుంచి వలస వస్తాయి. నాలుగు నెలల పాటూ ఇక్కడే ఉండి వాటి సంతానోత్పత్తిని పెంచుకుంటాయి. ఇలాంటి క్రమంలో గుడ్లను పెట్టి పొదిగేలా చేసుకుంటాయి. వీటికి పెద్ద పెద్ద శబ్ధాలు, కాంతి అంటే భయంగా చెబుతారు స్థానికులు. అందుకే వాటికి ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం కల్పించకుండా ఉండేందుకు నిశ్శబ్ధ దీపావళిగా జరుపుకుంటున్నారు.

ల్లప్పంపాళయం, వడముగం వెల్లోడే, సెమ్మందంపాళయం, కరుక్కనకట్టు వలస, పుంగంపాడి గ్రామాల్లోని దాదాపు 1000 మంది కుటుంబాలు పక్షుల జాతిని పరిరక్షించడానికి చిన్న నిప్పు రవ్వలు వస్తూ ఎక్కువ కాంతి ఇవ్వని టపాసులను కాలుస్తారు. ఈ పద్దతిని గత 17ఏళ్లుగా కొనసాగిస్తూ వస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?