ITBP Recruitment 2023: ఐటీబీపీలో 248 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. రేపట్నుంచి దరఖాస్తులు
భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) స్పోర్ట్స్ కోటా కింద.. కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 248 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) గ్రూప్ 'సి' నాన్-గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అథ్లెటిక్స్, ఆక్వాటిక్స్, ఈక్వెస్ట్రియన్, స్పోర్ట్స్ షూటింగ్, బాక్సింగ్..
భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) స్పోర్ట్స్ కోటా కింద.. కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 248 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) గ్రూప్ ‘సి’ నాన్-గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అథ్లెటిక్స్, ఆక్వాటిక్స్, ఈక్వెస్ట్రియన్, స్పోర్ట్స్ షూటింగ్, బాక్సింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్, హాకీ, వెయిట్ లిఫ్టింగ్, ఉషు, కబడ్డీ, రెజ్లింగ్, ఆర్చరీ, కయాకింగ్, కానోయింగ్, రోయింగ్.. క్రీడాంశాల్లో అర్హతతోపాటు పదో తరగతిలో ఉత్తీర్ణులైన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా అభ్యర్ధులను ఎంపిం చేస్తారు.
సంబంధిత క్రీడాంశంలో క్రీడాంశంలో ప్రతిభావంతులై ఉండాలి. అలాగే గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతిలో ఉత్తీర్ణత పొందిఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 28, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 13, 2023వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. యూఆర్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్ధులు రూ.100 పరీక్ష రుసుము కింద చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ / ఎస్టీ / మాజీ సైనికోద్యోగులు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. రాత పరీక్ష ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతంగా చెల్లిస్తారు.
ఖాళీల వివరాలు..
- అథ్లెటిక్స్ పోస్టులు: పురుషులు 27, మహిళలు 15
- ఆక్వాటిక్స్ పోస్టులు: పురుషులు 39
- ఈక్వెస్ట్రియన్ పోస్టులు: పురుషులు 8
- స్పోర్ట్స్ షూటింగ్ పోస్టులు: పురుషులు 20, మహిళలు 15
- బాక్సింగ్ పోస్టులు: పురుషులు 13, మహిళలు 8
- ఫుట్‌బాల్ పోస్టులు: పురుషులు 19
- జిమ్నాస్టిక్ పోస్టులు: పురుషులు 12
- హాకీ పోస్టులు: పురుషులు 7
- వెయిట్ లిఫ్టింగ్ పోస్టులు: పురుషులు 14, మహిళలు 7
- ఉషు పోస్టులు: పురుషులు 2
- కబడ్డీ పోస్టులు: మహిళలు 5
- రెజ్లింగ్ పోస్టులు: పురుషులు 6
- ఆర్చరీ పోస్టులు: పురుషులు 4, మహిళలు 7
- కయాకింగ్ పోస్టులు: మహిళలు 4
- కానోయింగ్ పోస్టులు: మహిళలు 6
- రోయింగ్ పోస్టులు: పురుషులు 2, మహిళలు 8
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
అధికారిక వెబ్‌సైట్ కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.