AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS LAWCET 2023: తెలంగాణ లాసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. ఎప్పటి నుంచి ప్రారంభమంటే..

ప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లా విద్యార్ధులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి తీపికబురు చెప్పింది. లాసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియకు సంబంధించిన హెడ్యూల్‌ విడుదల చేసింది. నవంబర్‌ 14 నుంచి ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ ప్రారంభంకానున్నట్లు పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌ లింబాద్రి షెడ్యూల్‌ విడుదల చేశారు. కౌన్సెలింగ్‌కు నవంబర్‌ 11న నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇతర వివరాలు అధికారిక షెడ్యూల్‌..

TS LAWCET 2023: తెలంగాణ లాసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. ఎప్పటి నుంచి ప్రారంభమంటే..
Telangana Lawcet 2023
Srilakshmi C
|

Updated on: Nov 12, 2023 | 9:12 PM

Share

హైదరాబాద్‌, నవంబర్‌ 12: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లా విద్యార్ధులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి తీపికబురు చెప్పింది. లాసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియకు సంబంధించిన హెడ్యూల్‌ విడుదల చేసింది. నవంబర్‌ 14 నుంచి ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ ప్రారంభంకానున్నట్లు పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌ లింబాద్రి షెడ్యూల్‌ విడుదల చేశారు. కౌన్సెలింగ్‌కు నవంబర్‌ 11న నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇతర వివరాలు అధికారిక షెడ్యూల్‌ నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నీట్‌ పీజీ ప్రవేశ 2024 పరీక్ష తేదీ విడుదల

నీట్‌ పీజీ, నీట్‌ ఎండీఎస్‌-2024 ప్రవేశ పరీక్షల తాత్కాలిక తేదీలను మెడికల్‌ సర్వీసెస్‌ జాతీయ పరీక్షల బోర్డు తాజాగా ప్రకటించింది. నీట్‌ పీజీ పరీక్ష 2024 మార్చి 3వ తేదీన జరగనున్నట్లు వెల్లడించింది. నీట్‌ ఎండీఎస్‌ పరీక్ష ఫిబ్రవరి 9వ తేదీన జరగనుంది. ఈ మేరక పరీక్ష తేదీలను వెల్లడిస్తూ ప్రకటన వెలువరించింది.

ఏపీలో స‌మ్మెటివ్ 1 ప‌రీక్షలు వాయిదా.. కొత్త తేదీలివే

సమ్మెటివ్‌-1 పరీక్షల షెడ్యూల్‌ మార్పు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈ పరీక్షలను వాయిదా వేసినట్లు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. దీంతో నవంబరు 14 నుంచి నిర్వహించాల్సిన పరీక్షలను నవంబర్‌ 24కు వాయిదా వేసింది. డిసెంబరు 6 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయని వెల్లడించింది. ఇక నవంబర్‌ 24, 25 తేదీల్లో పదోతరగతి కాంపోజిట్‌ తెలుగు పరీక్షలు జరగనున్నాయి. అన్ని తరగతులవారికి నవంబర్‌ 28 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొంది. ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌, స్మార్ట్‌ టీవీలు ఉన్నచోట మాత్రమే టోఫెల్‌ పరీక్ష ఉంటుందని స్పష్టం చేసింది. సీబీఎస్‌ఈ గుర్తింపు పొందిన వెయ్యి పాఠశాలల్లో మాత్రం 8, 9 తరగతులకు నవంబర్ 28 నుంచి పరీక్షలు జరుగుతాయని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఆంధ్రపరదేశ్‌ పదో తరగతి పరీక్షల 2024 ఫీజు గడువు పొడిగింపు

ఏపీ పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువును పొడిగిస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబరు 20వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. వరుసగా రూ.50, రూ.200, రూ.500 అపరాధ రుసుముతో డిసెంబరు 5 వరకు ఫీజు చెల్లించవచ్చిన ఆయన వివరించారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

రేపే చంద్ర సంచారం.. వీరు జాగ్రత్త ఉండకపోతే ముప్పు తిప్పలు తప్పవు!
రేపే చంద్ర సంచారం.. వీరు జాగ్రత్త ఉండకపోతే ముప్పు తిప్పలు తప్పవు!
సిరీస్ మొత్తం అవే.. ఒంటరిగా చూడాల్సిందే
సిరీస్ మొత్తం అవే.. ఒంటరిగా చూడాల్సిందే
ఆచితూచి తిన్నా బరువు పెరుగుతున్నారా? ఇలా ఎందుకు జరుగుతుందంటే..
ఆచితూచి తిన్నా బరువు పెరుగుతున్నారా? ఇలా ఎందుకు జరుగుతుందంటే..
శివరాత్రి రోజున అస్సలే చేయకూడని తప్పులు ఇవే!
శివరాత్రి రోజున అస్సలే చేయకూడని తప్పులు ఇవే!
స్టైల్ గా ఉరేసుకుంటూ రీల్ చేసిన మహిళ.. కట్ చేస్తే సీన్ రివర్స్
స్టైల్ గా ఉరేసుకుంటూ రీల్ చేసిన మహిళ.. కట్ చేస్తే సీన్ రివర్స్
పార్వతీదేవి స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం.. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే
పార్వతీదేవి స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం.. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే
మటన్‌లోని ప్రతీ పార్టూ పవర్‌ఫులే.. ఇది తెలిస్తే ఇంకేం తినరు..
మటన్‌లోని ప్రతీ పార్టూ పవర్‌ఫులే.. ఇది తెలిస్తే ఇంకేం తినరు..
ఏటీఎం చోరీకి వచ్చి అడ్డంగా బుక్కైన దొంగ.. అతను ఎవరో తెలిసి..
ఏటీఎం చోరీకి వచ్చి అడ్డంగా బుక్కైన దొంగ.. అతను ఎవరో తెలిసి..
ప్రెగ్నెంట్‌ సమయంలో మహిళలను ఎందుకని పాము కాటు వేయదు?
ప్రెగ్నెంట్‌ సమయంలో మహిళలను ఎందుకని పాము కాటు వేయదు?
ఈ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్ ఆత్మహత్య చేసుకున్నారు..
ఈ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్ ఆత్మహత్య చేసుకున్నారు..