జ్ఞాపకశక్తిని చంపేస్తున్న కరోనా మహమ్మారి, బ్రిటన్‌ పరిశోధనలో తేలిన వాస్తవం:Covid 19.

ఏ దుర్ముహూర్తాన కరోనా పుట్టిందో తెలియదు కానీ... సూక్ష్మాతి సూక్ష్మమైన ఆ వైరస్‌ మానవాళి ప్రాణాలను బలిగొనడమే కాకుండా అన్ని రంగాలను సర్వనాశనం చేస్తోంది.. కరోనా సోకిన వారిలో చాలా మంది మందో మాకో తీసుకుని ప్రాణాలతో బయటపడుతున్నారు..

జ్ఞాపకశక్తిని చంపేస్తున్న కరోనా మహమ్మారి, బ్రిటన్‌ పరిశోధనలో తేలిన వాస్తవం:Covid 19.
Covid
Follow us
Balu

| Edited By: Anil kumar poka

Updated on: Jun 25, 2021 | 1:15 PM

ఏ దుర్ముహూర్తాన కరోనా పుట్టిందో తెలియదు కానీ… సూక్ష్మాతి సూక్ష్మమైన ఆ వైరస్‌ మానవాళి ప్రాణాలను బలిగొనడమే కాకుండా అన్ని రంగాలను సర్వనాశనం చేస్తోంది.. కరోనా సోకిన వారిలో చాలా మంది మందో మాకో తీసుకుని ప్రాణాలతో బయటపడుతున్నారు.. కొందరు మాత్రం ఆ వైరస్‌ ముందు అశక్తులవుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ మహమ్మారి నుంచి కోలుకున్నవారికి కూడా ఏదో ఒక సమస్య వెంటాడుతూ వస్తోంది.. శరీరంలో ఉన్న అవయవాల మీద అంతటి ప్రభావాన్ని చూపుతోంది ఆ వైరస్‌.. ఇప్పుడు జ్ఞాపకశక్తి మీద కూడా ప్రభావం చూపుతోంది.. ఏడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న ఆ వైరస్‌ వివిధ రకాలుగా రూపాలు మార్చుకుంటూ స్వైరవిహారం చేస్తోంది. ఆర్ధికవ్యవస్థను చిన్నాభిన్నం చేసింది.. కుటుంబాలను విచ్ఛినం చేసింది..మనుషుల జీవన విధానాన్నే పూర్తిగా మార్చివేసింది. కోవిడ్‌కు ముందు కాలానికి వర్తమానానికి చాలా తేడాలు వచ్చాయి. కరోనా అంటే ఓ రకమైన భయం పుట్టుకొచ్చింది.. ఎక్కడ పుట్టి ముంచేస్తుందోనన్న భయం! కరోనా సోకితే ఏమవుతుందోనన్న ఆందోళన. దీనివల్ల మనుషుల ఆలోచనలే మారిపోయాయి. మెదళ్లు చురుగ్గా పని చేయడం లేదిప్పుడు. జ్ఞాపకశక్తి సన్నగిల్లుతోంది..మనుషులు మునుపటిలా క్రియాశీలకంగా వ్యవహరించడం లేదిప్పుడు. కరోనాను అదుపులోకి తెచ్చేందుకు లాక్‌డౌన్‌లు విధించాయి ప్రభుత్వాలు.. లాక్‌డౌన్‌ వల్ల మేలు జరిగిందో కీడు జరిగిందో ఇప్పుడు చెప్పడం కష్టం కానీ.. కొన్ని నష్టాలైతే జరిగాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటిపట్టునే ఉండటం వల్ల బంధు మితరులతో సంబంధాలు పోయాయి. ప్రత్యక్షంగా కలుసుకోలేకపోవడంతో మునుపటి అంతటి ఆప్యాయతలు లేవు. స్నేహపూర్వక సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇలాంటివి కచ్చితంగా మస్తిష్కంలో ప్రభావం చూపుతాయి అంటున్నారు పరిశోధకులు. మనిషి సంఘజీవి.. ఒంటరిగా ఉండటం సాధ్యం కాదు.. సమూహంగా ఉండటానికే ఇష్టపడతాడు.. అందుకే సంఘాలు పుట్టాయి.. కలివిడితనం వచ్చింది.. లాక్‌డౌన్‌తో సహజ ప్రవృత్తికి భిన్నంగా వ్యవహరించాల్సి వచ్చింది. సామాజిక సంబంధాలు దెబ్బతిన్నాయి. పర్యావసానంగా మనిషి మెదడు, ఆలోచనలు, జ్ఞాపకశక్తిపై ప్రభావం పడుతోంది. వెస్ట్‌మినిస్టర్‌ యూనివర్సిటీ కాగ్నిటివ్‌ న్యూరోసైన్స్‌ ప్రొఫెసర్‌ కేథరీన్‌ లవ్‌ డే నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కరోనా కాలంలో కొంతమంది అభిప్రాయాలు సేకరించిన ప్రొఫెసర్‌కు ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలిశాయి. గతంలోలా తమకు ఏదీ అంతగా గుర్తుండటం లేదని చాలా మంది చెప్పొచ్చారు. తాము బాగా గుర్తుంచుకున్న విషయాల్లో ఏదో ఒక భాగాన్ని మరిచిపోతున్నట్టు వారు తెలిపారట! మునుపటిలా చురుగ్గా వ్యవహరించలేకపోతున్నామని వివరించారట. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే కోవిడ్‌ పరిస్థితుల ప్రభావం పురుషుల కంటే మహిళలపైనే ఎక్కువగా పడటం. పురుషులతో పోలిస్తే మహిళల జ్ఞాపకశక్తే ఎక్కువగాతగ్గిందట! మొత్తంమీద కరోనా మానవాళిని కాల్చుకు తింటోంది..

మరిన్ని ఇక్కడ చూడండి: మహిళను కాపాడిన రైల్వే కానిస్టేబుల్‌ పై ప్రశంసల వర్షం..ఇంతకీ ఎం చేసాడో తెలుసా..?షాకింగ్ వీడియో:Viral Video.

బైకర్ వెరైటీ స్టంట్స్..ఎక్కడా జాగలేనట్టు గా …మరి ప్రమాదకరమైన ప్రదేశంలో వినూత్న ప్రయత్నం :Biker viral video.

వరుడు ఫిల్మ్ రేంజ్ లో ఎంట్రీ కి ఫిదా అయినా పెళ్లికూతురు..నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో : Viral Video.