AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Emergency 1975: ఎమర్జెన్సీ చీకటి రోజులను మర్చిపోలేం.. కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ ఫైర్

Emergency 1975- Indira Gandhi: దేశ ప్రజాస్వామ్య చరిత్రలో రెండేళ్ల ఎమర్జెన్సీ కాలం చీకటి రోజులుగా మిగిలిపోయింది. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ పోరాటాలు చేసిన ఎందరో జైళ్లకు వెళ్లారు.

Emergency 1975: ఎమర్జెన్సీ చీకటి రోజులను మర్చిపోలేం.. కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ ఫైర్
Indira Gandhi
Janardhan Veluru
|

Updated on: Jun 25, 2021 | 11:41 AM

Share

Emergency 46th Anniversary: ప్రజల ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించి నేటికి 46 ఏళ్లు పూర్తయ్యాయి. 1975 జూన్ 25న నాటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటన చేశారు. 1975 నుంచి 1977 వరకు 21 మాసాలు పాటు(దాదాపు రెండేళ్లు) దేశంలో ఎమర్జెన్సీ అమలులో ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 మేరకు దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ 1975 జూన్ 25న ఆదేశాలు జారీ చేశారు. 1977 మార్చి 21న ఎమర్జెన్సీని ఉపసంహరించుకున్నారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ కాలం చీకటి రోజులుగా మిగిలిపోయింది. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ పోరాటాలు చేసిన ఎందరో జైళ్లకు వెళ్లారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. ఎమర్జెన్సీతో దేశ ప్రజాస్వామ్య నీతిని కాంగ్రెస్ కాలరాసిందంటూ ధ్వజమెత్తారు. నాటి చీకటి రోజులను ఎప్పటికీ మర్చిపోలేమని వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీ అమలులో ఉన్న 1975-1977 మధ్యకాలంలో దేశంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారంటూ ధ్వజమెత్తారు. దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు, రాజ్యాంగ విలువలను పెంపొందించేందుకు కంకణబద్ధంకావాలంటూ దేశ ప్రధాని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ కాలంలో వేటివేటిని బ్యాన్ చేశారో తెలియజేస్తూ బీజేపీ చేసిన ఓ పోస్ట్‌ను కూడా ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

అటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా  ఎమర్జెన్సీ చీకటి రోజులను గుర్తుచేసుకుంటూ…కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.

ఇవి కూడా చదవండి..

జమ్మూకశ్మీర్ నేతలతో ప్రధాని మోదీ సుదీర్ఘ సమావేశం.. నియోజకవర్గాల పునర్విభజనపై భిన్నాభిప్రాయాలు!

మరియమ్మ కస్టోడియల్ డెత్ హైకోర్టు సీరియస్.. మృత దేహానికి రీపోస్టుమార్టం చేయాలని ఆదేశం..