AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manjamma Jogati: పద్మశ్రీ పొందిన తొలి ట్రాన్స్‌జెండర్‌.. మంజమ్మ జీవితం ఎందరికో ఆదర్శం

Padma Shri Awardee Manjamma Jogati: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2021 పద్మశ్రీ పురస్కారాలను ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‎జెండర్, జానపద నృత్యకారిణి మంజమ్మ

Manjamma Jogati: పద్మశ్రీ పొందిన తొలి ట్రాన్స్‌జెండర్‌.. మంజమ్మ జీవితం ఎందరికో ఆదర్శం
Manjamma Jogati
Shaik Madar Saheb
|

Updated on: Nov 10, 2021 | 1:31 PM

Share

Padma Shri Awardee Manjamma Jogati: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2021 పద్మశ్రీ పురస్కారాలను ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‎జెండర్, జానపద నృత్యకారిణి మంజమ్మ జోగతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి పద్మ అవార్డును అందుకునే ముందు మంజమ్మ జోగతి రాష్ట్రపతికి దిష్టి తీశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంజమ్మ తన స్టైల్లో రాష్ట్రపతిని నమస్కరించి.. అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మంజమ్మ తన చీర కొంగుతో రామ్‌నాథ్‌కు దిష్టి తీసినట్లు కనిపించారు. అయితే.. మంజమ్మ గొప్ప సంఘ సంస్కర్తగా.. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. సమాజసేవ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా.. మంజమ్మ క‌ర్ణాట‌క జాన‌ప‌ద అకాడ‌మీకి అధ్యక్షురాలిగా ప‌నిచేసిన తొలి ట్రాన్స్‌విమెన్‌గా చరిత్రలో నిలిచారు. అంతేకాకుండా దేశంలో పద్మశ్రీ అందుకున్న (2019లో) తొలి ట్రాన్స్ జెండర్‌గా మంజమ్మ నిలిచారు.

దశాబ్దాల పోరాటం.. మంజమ్మ దశాబ్దాలపాటు సామాజిక, ఆర్థిక పోరాటాలు చేశారు. చిన్ననాటి నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. వాటన్నింటిని తట్టుకుని.. నేడు సన్మానాలు అందుకుంటూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. బళ్లారి జిల్లాలోని కల్లుకంబ గ్రామానికి చెందిన మంజమ్మ అసలు పేరు మంజునాథ్ శెట్టి. యుక్త వయసులో తనను తాను స్త్రీగా గుర్తించి మంజమ్మగా పేరు మార్చుకున్నారు. దీనిని ఆమె కుటుంబం కూడా అంగీకరించి.. మంజమ్మను జోగప్పగా మార్చడానికి హోస్పేట్ సమీపంలోని హులిగేయమ్మ ఆలయానికి తీసుకువెళ్లి పూజలు చేసింది. అనంతరం మంజమ్మ జోగతి చిన్ననాటి నుంచి పలు కళారూపాలు, జోగతి నృత్యం, దేవతలను స్తుతిస్తూ జానపద పాటలు పాడటంలో ప్రావీణ్యం సంపాదించుకున్నారు. జానపద నృత్యకారిణిగా తన వృత్తిని ప్రారంభించిన మంజమ్మ.. జోగిని కాళవ్వ మరణానంతరం జోగటి బృందం బాధ్యతలు స్వీకరించి రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చారు.

కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాలలో జానపద నృత్య కళలను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో ఆమె ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె సేవలను గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం పలు అవార్డులతో సత్కరించింది. మంగమ్మ సేవలకు గాను 2006లో కర్ణాటక జనపద అకాడమీ అవార్డు లభించింది. 13 సంవత్సరాల తర్వాత 2019లో కర్ణాటక జనపద అకాడమీ సంస్థ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. 2010లో కర్ణాటక ప్రభుత్వం ఆమెను వార్షిక కన్నడ రాజ్యోత్సవ అవార్డుతో సత్కరం చేసింది.

Also Read:

Viral News: బావిలో వింత శబ్ధాలు.. చూసి హడలెత్తిపోయిన గ్రామస్థులు.. చివరకు ఏమైందంటే..?

Shocking Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. 22 అంతస్తుల భవనం గోడపై ఇద్దరు చిన్నారులు ఏం చేశారంటే..?