Viral News: బావిలో వింత శబ్ధాలు.. చూసి హడలెత్తిపోయిన గ్రామస్థులు.. చివరకు ఏమైందంటే..?
పురాతన బావిలో అకస్మాత్తుగా వింతశబ్ధాలు వచ్చాయి.. దీంతో ఆ గ్రామస్తులు ఎంటోనని అక్కడికి వెళ్లి పరిశీలించారు.. చివరకు అక్కడ కనిపించిన దృశ్యం చూసి హడలెత్తిపోయారు. వెంటనే గ్రామంలోకి పరుగులు తీసి..
Abandoned Well: పురాతన బావిలో అకస్మాత్తుగా వింతశబ్ధాలు వచ్చాయి.. దీంతో ఆ గ్రామస్తులు ఎంటోనని అక్కడికి వెళ్లి పరిశీలించారు.. చివరకు అక్కడ కనిపించిన దృశ్యం చూసి హడలెత్తిపోయారు. వెంటనే గ్రామంలోకి పరుగులు తీసి.. గ్రామ పెద్దకు ఈ విషయాన్ని చెప్పారు. వివరాల్లోకెళ్తే.. ఓ పురాతన బావిలో భారీ కోబ్రా కనిపించింది. దీంతో భయభ్రాంతులకు గురైన గ్రామస్థులు అధికారులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పామును రక్షించి సురక్షితప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ ఘటన ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఖుంటా ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న బావిలో 12 అడుగుల కింగ్ కోబ్రా చిక్కుకుపోయింది. అనంతరం సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది.. దానిని బావిలోనుంచి బయటకు తీశారు. అనంతరం దానికి పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం బాగుండటంతో దానిని అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. పామును చూసేందుకు గ్రామస్థులు తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు. భారీ పామును చూసి వారు ఒక్కసారిగా భయపడినట్లు గ్రామస్థులు తెలిపారు.
కాగా.. కింగ్ కోబ్రా పాము ఆగ్నేయాసియాలో సంచరించే అత్యంత విషమైన పాము. ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము ఇదే. ఇది దాదాపు 6.7 మీటర్లు (22 అడుగులు) వరకు పెరుగుతుంది. సాధారణంగా దట్టమైన అరణ్యాలలో నివసించే ఈ రకమైన పాములు.. ఇతర పాములను ఆహారంగా తింటాయి. దాని విషం తీవ్రత ఎలాఉంటుందంటే.. ఒక్క కాటుతోనే మనుషులను చంపగలదు. ఈ పాము కాటేస్తే.. మరణాల రేటు 75% వరకు ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ట్విట్..
Odisha: Forest Department rescued a 12-feet king cobra from an abandoned well in Khunta area of Mayurbhanj district yesterday.
“The health of the king cobra was verified and then released into its natural habitat,” a forest officer said. pic.twitter.com/zShQu31WnJ
— ANI (@ANI) November 10, 2021
Also Read: