Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఇంట్లో దూరిన భారీ కొండ చిలువ.. రెస్క్యూ సిబ్బందిపైనే అటాక్‌కు యత్నం..!
Viral Video: కొన్ని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. సాధారణంగా పాములు, పులులు, ఇలా ఏదైనా జంతువుల వీడియోలు కనిపిస్తే చాలు..
Viral Video: కొన్ని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. సాధారణంగా పాములు, పులులు, ఇలా ఏదైనా జంతువుల వీడియోలు కనిపిస్తే చాలు నెటిజన్లు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. చూడడమే కాదు.. షేర్ల మీద షేర్లు చేస్తుంటారు. ఇక సాధారణంగా పాములు, కొండ చిలువలు అటవీ ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. కానీ ఈ మధ్య కాలంలో ఇళ్లల్లోకి చొరబడుతున్నాయి. పాములంటేనే జనాలు జంకుతుంటారు. అలాంటి ఓ కొండ చిలువ ఏకంగా ఇంట్లోనే దూరితే ఎలా ఉంటుంది.. అందరిని హడలెత్తిస్తుంటుంది. అలాంటి వీడియో మీకు చూపించబోతున్నాము. ఓ కొండ చిలువ ఏకంగా ఇంట్లో దూరి నానా హంగామా సృష్టించింది. ఈ ఘటన యూఎస్‌లోని సౌత్ ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. ఇంట్లో దూరిన కొండ చిలువ ఏకంగా ఇంట్లోని సీలింగ్‌లోకి దూరిపోయింది. అయితే కొండ చిలువను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించారు.
ఆ భారీ కొండ చిలువను పట్టుకునేందుకు వచ్చిన రెస్క్యూ సిబ్బంది వచ్చి దానిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తే అతనిపైనే అటాక్ చేసేందుకు ప్రయత్నించింది. టోపీ చూపిస్తూ దానిని పట్టుకునేందుకు ప్రయత్నించినా.. కరిచేందుకు బుసలుకొట్టింది. చివరికి ఎలాగోల కష్టపడి దానిని పట్టుకునే వెళ్లిపోయారు సిబ్బంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన కొందరు జడుసుకుంటున్నారు. వామ్మో ఇంతపెద్ద కొండచిలువనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. రెస్క్యూ టీమ్ సిబ్బంది చేసిన సహసానికి పలువురు ప్రశంసిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: