Viral Video: ‘అమ్మా.. నా పిల్లల జోలికి వస్తే ఊరుకుంటానా.?’ శునకాన్ని తరిమి తరిమి ఉరికించిన కోడి.. వైరల్ వీడియో..
Viral Video: ఈ ప్రపంచంలో ఏ కల్మషం లేని బంధంలో తల్లి, బిడ్డలది మొదటి స్థానంలో ఉంటుంది. తాను ఎలా ఉన్నా తన బిడ్డ సంతోషంగా ఉండాలని ప్రతి తల్లీ ఆలోచిస్తుంది. బిడ్డ సంరక్షణ కోసం ఎంతదూరమైనా వెళుతుంది..

Viral Video: ఈ ప్రపంచంలో ఏ కల్మషం లేని బంధంలో తల్లి, బిడ్డలది మొదటి స్థానంలో ఉంటుంది. తాను ఎలా ఉన్నా తన బిడ్డ సంతోషంగా ఉండాలని ప్రతి తల్లీ ఆలోచిస్తుంది. బిడ్డ సంరక్షణ కోసం ఎంతదూరమైనా వెళుతుంది.. ఎవరితోనైనా పోరాడుతుంది. తన ఒంట్లో ఉన్న శక్తి చాలకపోయినా, శక్తినంతా దారపోసి బిడ్డను శత్రువుల నుంచి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఇది కేవలం మనుషులకే పరిమితం అనుకుంటే మనం పొరపడినట్లే.. ఎందుకంటే జంతువులు కూడా తమ పిల్లలపై అమితమైన ప్రేమను ప్రదర్శిస్తుంటాయి. తమ పిల్లల జోలికి వస్తే ఎంతటి వారితోనైనా పోటీకి దిగుతాయి.
తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియోనే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ వీడియో ఓ కోడి తన పిల్లలను తీసుకొని షెడ్డు నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో ఓ శునకం కోడి పిల్లలపైకి దూసుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన తల్లి కోడి ఆ శునకంపైకి దాడి చేసింది. తన కంటే పెద్ద జీవి అని తెలిసినా.. శునకాన్ని తరిమి, తరిమి ఉరికించింది. తన పిల్లలు సేఫ్ అనుకునేంత దూరం వరకు కుక్కను తరిమి కొట్టింది. దీనంతటినీ అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తల్లి ప్రేమకు ప్రతిరూపంగా ఉన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి..
Chicken wasn’t playing games. ????? pic.twitter.com/Nzpvv25n6r
— Fred Schultz (@fred035schultz) November 8, 2021
గర్భిణులకు హెచ్చరిక.. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే బిడ్డకి చాలా ప్రమాదం..
Crime News: పెద్దపల్లి జిల్లాలో మరో దారుణం.. ప్రేమించలేదని యువతి గొంతు కోసిన ఉన్మాది..!