India T20 Squad: టీం ఇండియా టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. కివీస్‌తో సిరీస్‌కు జట్టును ప్రకటించిన బీసీసీఐ..
India T20 Captain: టీం ఇండియా టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను నియమించారు. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ ఉండనున్నాడు...
India T20 Captain: టీం ఇండియా టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను నియమించారు. న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. నవంబర్ 17, 2021 నుంచి భారత్ 3 టీ20లు ఆడనుంది. ఈ సిరీస్‌తో ద్రవిడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.
భారత టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్-కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్-కీపర్), వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్ అశ్విన్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మొహమ్మద్ సిరాజ్.
టీ20 సిరీస్ షెడ్యూల్:
- నవంబర్ 17న మొదటి టీ20 మ్యాచ్ జైపూర్
- నవంబర్ 19న రెండో టీ20 మ్యాచ్ రాంచీ
- నవంబర్ 21న మూడో టీ20 మ్యాచ్ కోల్కత్తా
NEWS – India’s squad for T20Is against New Zealand & India ‘A’ squad for South Africa tour announced.@ImRo45 named the T20I Captain for India.
More details here – https://t.co/lt1airxgZS #TeamIndia pic.twitter.com/nqJFWhkuSB
— BCCI (@BCCI) November 9, 2021
Read Also..T20 World Cup 2021: ఇలా చేశావు ఏంటి బుమ్రా.. తలపై చేతులు పెట్టుకున్న హార్దిక్ పాండ్యా..