Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ప్రేక్షకులతో నిండిపోనున్న స్టేడియం.. అంగీకరించిన బీసీసీఐ, ఈసీబీ..

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‎కు దుబాయ్ స్టేడియం ఫుల్ కానుంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI), ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) అనుమతి లభించినందున దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మొత్తం 25,000 సీట్లు అభిమానులకు అందుబాటులో ఉంటాయి...

T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ప్రేక్షకులతో నిండిపోనున్న స్టేడియం.. అంగీకరించిన బీసీసీఐ, ఈసీబీ..
Bcci
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 09, 2021 | 10:06 PM

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‎కు దుబాయ్ స్టేడియం ఫుల్ కానుంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI), ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) అనుమతి లభించినందున దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మొత్తం 25,000 సీట్లు అభిమానులకు అందుబాటులో ఉంటాయి. నవంబర్ 14న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు 70శాతం సామర్థ్యంతోనే మ్యాచ్‌లను నిర్వహించారు. అయితే ఫైనల్‌కు మాత్రం దుబాయి మైదానంలో పూర్తి స్థాయిలో ప్రేక్షకులకు అనుమతించనున్నారు. కొవిడ్ నిబంధనల మధ్య మ్యాచ్ నిర్వహించనున్నారు. ఆదివారం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఈ టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటికే ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్లు సెమీస్ చేరాయి. బుధవారం జరగనున్న తొలి సెమీస్‌లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. నవంబర్ 11న జరగనున్న రెండో సెమీస్‌లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. రెండు సెమీఫైనలల్లో గెలించిన జట్లు నవంబర్ 14న దుబాయి వేదికగా ఫైనల్‎లో తలపడతాయి.

ఈ టీ20 వరల్డ్ కప్‎లో టీం ఇండియా నాకౌట్ చేరకుండానే వెనుదిరిగింది. పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన భారత్.. కవీస్ చేతిలో 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. సోమవారం జరిగిన చివరి సూపర్-12 మ్యాచ్‎లో నమీబియాపై గెలుపొందింది. ఈ మ్యాచ్‎లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తలో మూడు వికెట్లతో చెలరేగడంతో నమీబియాను 132 పరుగులకే పరిమితం చేసింది. నమీబియా ఓపెనర్లు మొదట భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నారు. ఐదో ఓవర్‌లో మైఖేల్ వాన్ లింగేన్ బుమ్రా వెనక్కు పంపాడు. తర్వాతి ఓవర్‌లో జడేజా క్రెయిగ్ విలియమ్స్‌ను డకౌట్ చేయడంతో స్పిన్నర్లు మేజిక్ మొదలైంది.

ఎడమచేతి వాటం స్పిన్నర్ తన తర్వాతి ఓవర్‌లో ఓపెనర్ స్టీఫెన్ బార్డ్‌ను 21 పరుగుల వద్ద అవుట్ చేశాడు. జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్ 10వ ఓవర్‌లో రవిచంద్రన్ అశ్విన్‎కు చిక్కాడు. అనుభవజ్ఞుడు నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్‌ను 13వ ఓవర్‌లో ఔటయ్యాడు. 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 15.2 ఓవర్లలో విజయం సాధించింది. రోహిత్ ఈ మ్యాచ్‎లో 37 బంతుల్లో 56(7 ఫోర్లు, 2 సిక్స్‎లు)పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 36 బంతుల్లో 54 పరుగులు చేశాడు.

Read Also.. India T20 Squad: టీం ఇండియా టీ20 కెప్టెన్‎గా రోహిత్ శర్మ.. కివీస్‎తో సిరీస్‎కు జట్టును ప్రకటించిన బీసీసీఐ..