T20 World Cup 2021: ఇలా చేశావు ఏంటి బుమ్రా.. తలపై చేతులు పెట్టుకున్న హార్దిక్ పాండ్యా..
టీ20 ప్రపంచ కప్‌లో నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చేసిన పని నవ్వు తెప్పించింది. అతడు తన చివరి ఓవర్‌లో రన్ అవుట్ అవకాశాన్ని కూడా హాస్యాస్పదంగా మిస్ చేశాడు...
టీ20 ప్రపంచ కప్‌లో నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చేసిన పని నవ్వు తెప్పించింది. అతడు తన చివరి ఓవర్‌లో రన్ అవుట్ అవకాశాన్ని కూడా హాస్యాస్పదంగా మిస్ చేశాడు. నమీబియా ఆల్‌రౌండర్ జాన్ ఫ్రైలింక్‌కి బుమ్రా18వ ఓవర్‌లో ఒక యార్కర్‌ను వేశాడు. అతను దానిని ఎలాగో డ్రైవ్ చేసి పరుగుకు ప్రయత్నించాడు. బుమ్రా చేతిని చాచి బంతిని పట్టుకుని స్టంప్‌లు లక్ష్యంగా బాల్ విసిరాడు.
— Lodu_Lalit (@LoduLal02410635) November 8, 2021
కానీ బంది వికెట్లకు తాకలేదు. రనౌట్ మిస్ కావటంతో హార్దిక్ పాండ్యా తలపై చేతులు పెట్టుకుని నవ్వుకున్నాడు. బుమ్రా రెండు బంతుల అనంతరం స్లో బాల్‌తో డేవిడ్ వైస్ వికెట్ తీశాడు. డేవిడ్ వైస్ క్యాచ్‌ను రోహిత్ శర్మ పట్టుకున్నాడు. నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా రెండు వికెట్లు తీసి 19 పరుగులు ఇచ్చాడు.
జస్ప్రీత్ బుమ్రాతో పాటు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తలో మూడు వికెట్లతో చెలరేగడంతో నమీబియాను 132 పరుగులకే పరిమితం చేసింది. నమీబియా ఓపెనర్లు మొదట భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నారు. ఐదో ఓవర్‌లో మైఖేల్ వాన్ లింగేన్ బుమ్రా వెనక్కు పంపాడు. తర్వాతి ఓవర్‌లో జడేజా క్రెయిగ్ విలియమ్స్‌ను డకౌట్ చేయడంతో స్పిన్నర్లు మేజిక్ మొదలైంది.
ఎడమచేతి వాటం స్పిన్నర్ తన తర్వాతి ఓవర్‌లో ఓపెనర్ స్టీఫెన్ బార్డ్‌ను 21 పరుగుల వద్ద అవుట్ చేశాడు. జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్ 10వ ఓవర్‌లో రవిచంద్రన్ అశ్విన్‌కు చిక్కాడు. అనుభవజ్ఞుడు నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్‌ను 13వ ఓవర్‌లో ఔటయ్యాడు. 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 15.2 ఓవర్లలో విజయం సాధించింది. రోహిత్ ఈ మ్యాచ్‌లో 37 బంతుల్లో 56(7 ఫోర్లు, 2 సిక్స్‌లు)పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 36 బంతుల్లో 54 పరుగులు చేశాడు.
Read Also.. T20 World Cup 2021: టాస్ ఓడినా, గెలిచినా.. మైదానంలో 100 శాతం ప్రదర్శన ఇవ్వాల్సిందే: విరాట్ కోహ్లీ