AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agra Tea Seller: ఊపిరి తిత్తులే నమూనాగా గాలితో నడిచే ఇంజన్‌ను తయారు చేసిన టీ స్టాల్ యజమాని…

Agra Tea Seller: రోజు రోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఓ వైపు బైక్, కారు బయటకు తీయాలన్నా.. ఎక్కువగా ఉపయోగించాలంటే .. మధ్య తరగతి, సామాన్యులకు గుండె గుభేలంటుంది..

Agra Tea Seller: ఊపిరి తిత్తులే నమూనాగా గాలితో నడిచే ఇంజన్‌ను తయారు చేసిన టీ స్టాల్ యజమాని...
Agra Tea Seller
Surya Kala
|

Updated on: Nov 09, 2021 | 7:57 PM

Share

Agra Tea Seller: రోజు రోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఓ వైపు బైక్, కారు బయటకు తీయాలన్నా.. ఎక్కువగా ఉపయోగించాలంటే .. మధ్య తరగతి, సామాన్యులకు గుండె గుభేలంటుంది. పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాలకు తరచుగా ఇంజనాయిల్ రెగ్యులర్ గా మార్చాలి. మరోవైపు పెట్రోల్, డీజిల్ వాహనాలతో రోజు రోజుకీ వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. ఇక ఈ వాహనాలు ఆరోగ్యానికి కూడా హానికరంగా మారాయి.. దీంతో వీటికి ప్రత్యామ్న్యాయంగా ఎలక్ట్రిక్ వాహనాలు అంటున్నారు పలువురు నిపుణులు. అయితే ఓ సామాన్య వ్యక్తి తన తెలివికి పదును పెట్టాడు.. పెట్రోల్, డీజిల్ కు బదులుగా గాలితో నడిచే ఇంజన్ ను కనిపెట్టాడు. వివరాల్లోకి వెళ్తే..

ఆగ్రాలోని ఫతేపూర్చెం సిక్రి కి చెందిన త్రిలోకి ప్రసాద్ డిగ్రీ చదివారు. బతుకుదెరువు  కోసం టీ అమ్ముతూ, సైకిళ్లను రిపేర్ చేసే షాపు కూడా నిర్వహిస్తున్నాడు.  అయితే ప్రసాద్ కు టీనేజ్ లో ఉండగా ఒక బోరు ఇంజన్ ను తయారు చేశారు.  సైకిల్ కి పంక్చర్లు వేస్తున్న సమయంలో  ఒకరోజు సైకిల్ ట్యూబ్ లోకి గాలి ఎక్కిస్తుండగా.. ఆ మోటార్ వాల్వ్ ఊడిపోయి గాలి బయటకు లీకైంది. దీంతో గాలి ఒత్తిడికి మోటార్ రివర్స్  అవ్వడం మోడలింది. ఇదంతా ప్రసాద్ గమనిస్తూనే ఉన్నాడు. అప్పుడే అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. గాలి శక్తిని గమనించిన ప్రసాద్ కు ఇదే ఫార్ములాతో ఇంజన్ ను ఎందుకు తయారు చేయకూడదు అని అనుకున్నాడు.  తన ఆలోచనలను స్నేహితులతో కలిసి ఆచరణ రూపంలో పెట్టారు. మనిషి ఊపిరితిత్తులాంటి రెండు గాలి తిత్తులను తయారు చేసి… వాటితో ఇంజన్ కు కలిపి. గాలి పీడనం జత చేశారు.

దీంతో ఇంజన్ స్టార్ట్ అయ్యింది. ఇది మొదటిసారి ప్రయోగం సక్సెస్ అయ్యింది. దీంతో తనకు వారసత్వంగా వచ్చిన ఇంటిని అమ్మి.. గాలితో పనిచేసే ఇంజన్ ను తయారు చేశారు. అనంతరం 2019లోనే నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో పేటెంట్ కు దరఖాస్తు చేశారు. అయితే అప్పుడు ఇంజన్ స్టార్ట్ కాలేదు. మళ్ళీ పట్టుదలతో పనిచేసి.. ఇప్పుడు గాలితో పనిచేసే ఇంజన్ ను రెడీ చేశారు. త్రిలోకి మరియు అతని బృందం దీపావళి రోజున ఇంజిన్‌ను ఆపరేట్ చేయడంలో విజయం సాధించారు మరియు ఇప్పుడు పేటెంట్ కోసం మళ్లీ దరఖాస్తు చేస్తున్నారు.

agra tea stal owner

గాలితో ఇంజన్ పనిచేస్తున్న సమయంలో ఘర్షణను తగ్గించేందుకు ల్యూబ్రికెంట్  వాడాల్సి ఉంటుంది. అయితే ఈ ఇంజన్పె ఆయిల్ మాత్రం నల్లగా మారదు. న్యూమాటిక్ ఇంజిన్ ద్విచక్ర వాహనం నుండి రైలు వరకు ఏదైనా నడపగలదు. వాహనం యొక్క అవసరాలకు అనుగుణంగా ఇంజిన్ ఆకారాన్ని మాత్రమే మార్చాలి.

Also Read:   చెన్నై వరదల్లో తమిళనాడు బీజేపీ నేతల ఫోటో షూట్.. ఇది మన నేతల తీరు అంటూ నెటిజన్లు సెటైర్స్