Neem Tree: వేప చెట్లకు అంతుచిక్కని వింత వ్యాధి..! ఉన్నట్టుండి ఎండిపోతున్న వేపచెట్లు.. (వీడియో)
ఉన్నట్టుండి వేప చెట్లు ఎండిపోతున్నాయి.. కారణం తెలియట్లేదు!! చిగుర్ల నుంచి ప్రారంభమై వేప చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి..గతంలో కర్ణాటక, రాయలసీమ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో నిర్జీవంగా మారిన వేప చెట్ల పరిస్థితి..
ఉన్నట్టుండి వేప చెట్లు ఎండిపోతున్నాయి.. కారణం తెలియట్లేదు!! చిగుర్ల నుంచి ప్రారంభమై వేప చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి..గతంలో కర్ణాటక, రాయలసీమ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో నిర్జీవంగా మారిన వేప చెట్ల పరిస్థితి.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకి పాకింది. డై బ్యాక్ డిసీజ్ అని కొందరు.. కాదు టీ మస్కిటో బగ్ వల్ల అని మరికొందరు నిపుణులు చెబుతున్న మాట.ఈ పరిణామంపై లోతుగా వర్సిటీల సమన్వయంతో అటవీ శాఖ విస్తృత పరిశోధనలు చేపట్టాలంటున్నారు నిపుణులు.
అనంతపురం, కర్నూలు తదితర రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలోనూ వేపచెట్లు ఎండిపోతున్నాయని చెప్తున్నారు. మొవ్వులు, చిగుర్లు, లేత కొమ్మలు, ఆకులు ఎర్రగా మారి రాలిపోతున్నాయి. పొలాలు, బంజరు భూముల్లోనే కాకుండా.. బెంగళూరు, హైదరాబాద్, అనంతపురం వంటి నగర, పట్టణ ప్రాంతాల్లోనూ వేప చెట్లు చనిపోతున్నాయి. దీనికి పలు కారణాలు చెబుతున్నారు ఉస్మానియా యూనివర్శిటీ ఎన్‌వీరాన్‌మెంట్ ప్రొఫెసర్లు. వేప చెట్లకి డై బ్యాక్ డీసీజ్, ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్లే పురుగు పట్టడం, ఎండుతున్నట్లు కనిపించడం, రంగు మారినట్లు చెప్తున్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంవిరాన్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెస్సార్ శశికళ … ‘టీ మస్కిటో బగ్’ అనే పురుగు ఆశించడం వల్ల సుడి భాగం క్రమంగా రెమ్మలు, కొమ్మలు, కాండం ఎండిపోయే పరిస్థితి ఉంటుందన్నారు. నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి ఇలా జరుగుతూ ఉంటుందని తెలిపారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)
Hebah Patel: ఏంజెల్ లా మెరుస్తున్న ‘హెబ్బా పటేల్’.. ఇలా చుస్తే ఎవరైనా పడిపోవాల్సిందే.. (ఫొటోస్)