Shocking Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. 22 అంతస్తుల భవనం గోడపై ఇద్దరు చిన్నారులు ఏం చేశారంటే..?

Kids jump Viral Video: పిల్లలు భగవంతుని స్వరూపం.. వారికి మనం ఎం చెబితే అది నేర్చుకుంటారు. వారి అమాయకత్వం, ఆప్యాయత మనందరినీ కట్టిపడేస్తుంటుంది. అందుకే చాలామంది

Shocking Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. 22 అంతస్తుల భవనం గోడపై ఇద్దరు చిన్నారులు ఏం చేశారంటే..?
Kids Jump Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 10, 2021 | 11:15 AM

Kids jump Viral Video: పిల్లలు భగవంతుని స్వరూపం.. వారికి మనం ఎం చెబితే అది నేర్చుకుంటారు. వారి అమాయకత్వం, ఆప్యాయత మనందరినీ కట్టిపడేస్తుంటుంది. అందుకే చాలామంది పిల్లలను అల్లారుముద్దుగా పెంచుతారు. వారి అల్లరిని తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇలాంటి సమయంలో వారిపై ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకోవాలని చాలామంది ప్రత్యేకంగా పేర్కొంటుంటారు. మనం వారిపై దృష్టిపెట్టకపోతే ప్రమాదంలో పడతారనడానికి ఈ వీడియోనే నిదర్శనం. ఎందుకంటే.. ఇద్దరు పిల్లలు 22 అంతస్తుల భవనంపైనా ఏం చేశారో చూస్తే.. మీకు కూడా కోపం వస్తుంది. ఈ వీడియో చూసినవారంతా పిల్లలను.. వారి తల్లిదండ్రులు అలా ఎలా వదిలిపెడతారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పిల్లలు అలా భవనంపైన ప్రమాదకర రీతిలో నిలబడిన దృశ్యాలు, వారు రూఫ్ పై చేసిన విన్యాసాలు అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ వీడియో చైనాలోని హుబీ ప్రాంతంలో ఉన్న జియానింగ్ కు చెందినది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ఇద్దరు చిన్నారులు.. 22 అంతస్తుల భవనం పైకప్పుపైకి ఎక్కి ఎలా దూకుతున్నారో వీడియోలో చూడవచ్చు. ఈ సమయంలో పిల్లలిద్దరూ నిర్భయంగా కనిపిస్తూ ఒక కప్పుపై నుంచి.. మరో పైకప్పు పైకి దూకుతుంటారు. అయితే.. పిల్లలిద్దరూ క్షేమంగా ఉంటారు. వారికి ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వైరల్‌గా మారిన ఈ వీడియోను సమీపంలోని ఓ వ్యక్తి రికార్డు చేశాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

దీనిని చూసిన నెటిజన్లంతా భయంతో పలు కామెంట్లు చేస్తున్నారు. పిల్లలను ఇలా వదిలేయకండి అంటూ పలు సూచనలు చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ఎప్పుడూ కన్నేసి ఉంచాలని.. సూచిస్తున్నారు. వీడియోలో పిల్లలిద్దరూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నారులకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వివిధ ప్లాట్‌ఫామ్‌లలో షేర్ అవుతోంది. ఈ వీడియోను స్పుత్నిక్ అనే పేజీ యూట్యూబ్‌లో షేర్ చేసింది. వీడియో..

Also Read:

Viral News: బావిలో వింత శబ్ధాలు.. చూసి హడలెత్తిపోయిన గ్రామస్థులు.. చివరకు ఏమైందంటే..?

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఇంట్లో దూరిన భారీ కొండ చిలువ.. రెస్క్యూ సిబ్బందిపైనే అటాక్‌కు యత్నం..!

ధైర్యమునోళ్లే చూడండి.. అత్యంత భారీ సైజు కొండచిలువ.. తల పైకి ఎత్తి
ధైర్యమునోళ్లే చూడండి.. అత్యంత భారీ సైజు కొండచిలువ.. తల పైకి ఎత్తి
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!