UPSC CSE Answer Key 2020: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..
UPSC CSE Answer Key 2020: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, CSE 2020 ఆన్సర్ కీ ని విడుదల చేసింది.
UPSC CSE Answer Key 2020: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, CSE 2020 ఆన్సర్ కీ ని విడుదల చేసింది. UPSC ఇటీవల నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష (ప్రిలిమినరీ పరీక్ష) పేపర్ I, పేపర్ II కి సంబంధించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ అయిన upsc.gov.in లో ఆన్సర్ కీ ని చూసుకోవచ్చు.
ఆన్సర్ కీ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే.. అభ్యర్థులు మొదటగా యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in లోకి వెళ్లాలి. హోమ్‌పేజీలో ‘ఎగ్జామినేషన్’ ట్యాబ్‌పై క్లిక్ చేసి, ఆపై ‘ఆన్సర్ కీ’పై క్లిక్ చేయండి. కంబైన్డ్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2020 ఆన్సర్ కీ పేరుతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో వచ్చే లింక్‌పై క్లిక్ చేస్తే PDF ఫైల్స్ ఓపెన్ అవుతాయి. మీకు ఏ పరీక్ష ఆన్సర్ కీ అవసరమో దానిని ఎంచుకుని ఆన్సర్ కీ ని చూసుకోవచ్చు. భవిష్యత్తు అవసరం కోసం కావాలంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు.
ఇదిలాఉంటే.. UPSC ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2020 ఆన్సర్ కీ కోసం అభ్యర్థులు చాలా రోజులగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యూపీఎస్సీ పేపర్ I, II కి సంబంధించి యొక్క మొత్తం నాలుగు సెట్లను విడుదల చేసింది. CSE ప్రిలిమ్స్ 2020 పరీక్ష అక్టోబర్ 4, 2020న నిర్వహించడం జరిగింది. పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు షార్ట్‌లిస్ట్ చేయబడతారు. మెయిన్స్‌లోనూ పాస్ అయితే ఇంటర్వ్యూ రౌండ్ ఎంపికవుతారు.
Also read:
Etela Rajender: ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఈటల రాజేందర్
Nayanthara-Shahrukh Khan: షారుఖ్ విషయంలో నయనతార కనిపెట్టిందేంటి? నయన్‌కి హెల్ప్ చేసిందెవరు ?