Etela Rajender: హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఈటల రాజేందర్
Etela Rajender: తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపొందిన ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం..
Etela Rajender: తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపొందిన ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ కార్యక్రమానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిలు హాజరయ్యారు. కాగా, మంత్రిగా ఉన్న ఈటలను పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో ఎమ్మెల్యే పదవికి జూన్ 12వ తేదీన ఈటల రాజీనామా చేయడంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది.
అయితే అంతకు ముందు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. తర్వాత ఏడో సారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందు గన్‌పార్క్ వద్ద ఈటల మాట్లాడుతూ.. ఉద్యమకారులు కేసీఆర్‌ను వదిలీ బయటకు రావాలని పిలుపునిచ్చారు. ఎనిమిదేళ్ళుగా వరి ధాన్యం కొన్నది ఎవరో కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్నా చౌక్ అవసరం ఏంటో కేసీఆర్‌కు తెలిసొచ్చిందని ఎద్దేవా చేశారు. ధర్నా చౌక్ వద్దన్న వాళ్ళే ధర్నా చౌక్ లో ఆందోళనలు చేస్తానంటున్నారు. బీజేపీ నాయకత్వంలో కేసీఆర్ అవినీతి పాలనపై పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఎగిరేది కాషాయ జెండా మాత్రమే అని అన్నారు. మిల్లింగ్ టెక్నాలజీని పెంచుకోవటంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కేసీఆర్ గంటకొద్దీ ప్రెస్ మీట్స్ చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, కేసీఆర్ పెద్ద నోరుతో చెబుతున్న అబద్దాలన్నీ నిజాలు అయిపోవని అన్నారు. ప్రజల మీద ప్రేమ ఉంటే కేసీఆర్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలని ఈటల డిమాండ్ చేశారు.
Many Congratulations to @Eatala_Rajender anna on being sworn in as MLA of Huzurabad assembly constituency today. My best wishes to him.#HuzurabadWithBJP@blsanthosh pic.twitter.com/14xs9N5jZ3
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 10, 2021
ఇవి కూడా చదవండి: