AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Viral: మొసలితో విన్యాసాలు చేస్తే రెచ్చిపోయింది.. ఇది చూసి ఏమంటారో చెప్పండి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్‌..!

Video Viral: ఏదైనా వీడియో వైరల్‌ కావాలంటే అది సోషల్‌ మీడియానే చెప్పక తప్పదు. వీడియో పోస్టు చేసిన కొన్ని నిమిషాల్లోనే లక్షల్లో వ్యూస్‌ను అందుకుంటుంది...

Video Viral: మొసలితో విన్యాసాలు చేస్తే రెచ్చిపోయింది.. ఇది చూసి ఏమంటారో చెప్పండి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్‌..!
Subhash Goud
|

Updated on: Nov 10, 2021 | 1:01 PM

Share

Video Viral: ఏదైనా వీడియో వైరల్‌ కావాలంటే అది సోషల్‌ మీడియానే చెప్పక తప్పదు. వీడియో పోస్టు చేసిన కొన్ని నిమిషాల్లోనే లక్షల్లో వ్యూస్‌ను అందుకుంటుంది. అందుకే జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియా వేదిక తెగ వైరల్‌ అవుతుంటాయి. నెటిజన్లు కూడా ఎంతో ఆసక్తికరంగా చూస్తుంటారు. అంతేకాదు ఈ వీడియోను షేర్ల మీద షేర్లు చేస్తుంటారు. తాజాగా ఓ మొసలి వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఎంతటి బలమైన జంతులువు కానీ, వ్యక్తులు కానీ మొసలికి చిక్కినట్లయితే ఇక అంతే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. మొసలితో ఆటలాడితే మృత్యువును కొనితెచ్చుకున్నట్లే. ఓ వ్యక్తి మొసలుతో తెగ విన్యాసాలు చేస్తున్నాడు. అక్కడ అందరు కేకలు వేయడం జరుగుతుంది. 28 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సరైనది కాదని చురకలంటిస్తున్నారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి మొసలితో విన్యాసాలు చేస్తున్న దృశ్యాలను చూడవచ్చు. ఆ వ్యక్తి చేతిని మొసలి నోట్లో పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు. కానీ కొంత సేపు తర్వాత ఆ మొసలి ఆ వ్యక్తి చేతిని పట్టుకుంటుంది. చివరికి ఎలాగోలా చేతిని బయటకు తీసేసుకున్నాడు.

ఈ వీడియో Nature 27_12 పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామలో పోస్టు చేశారు. ఈ వీడియో ఇప్పటికే 56వేలకుపైగా మంది వీక్షించారు. ఇంకా పెరుగుతూనే ఉంది. వీడియో చూసిన వారంతా షాక్‌కు గురవుతున్నారు. ఇది చూసిన నెటిజన్లు ఎవరికి నచ్చినట్లు వారు కామెంట్లు చేస్తున్నారు. ఇలా జంతువులతో స్టంట్లు చేస్తే ప్రాణాల మీదకు తెచ్చుకునే ప్రమాదం ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తూనే ఉంటాయి. కొందరు ప్రాణాల మీద సోయి లేకుండా నిర్లక్ష్యంగా జంతువులతో ఆటలాడితే ఇలాగే ఉంటుంది. నయం రెప్పపాటులో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.. లేకపోతే ఈ పాటికే మొసలి అతన్ని ఆరగించేది. ఇలా కొందరు జీవితాన్ని ఎలా ముందుకు సాగించాలి అనే విషయాలను తెలుసుకోండి ఇలా పనికిమాలిన పనులు చేస్తే ఇలాగే ఉంటుందని నెటిజన్లు తిట్టుకుంటున్నారు.

View this post on Instagram

A post shared by طبیعت (@nature27_12)

ఇవి కూడా చదవండి:

Viral Video: చిరుత జింకను వేటాడింది.. దానిని పట్టుకుని చెట్టుపైకి ఎక్కింది.. ఇంతలో సీన్‌ రివర్స్‌.. ఏం జరిగిందో చూడండి..!

Viral Video: నాగుపాము- కొండ చిలువ మధ్య భీకరపోరు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..!