JC Diwakar Reddy- Paritala Shriram: అనంత రాజకీయాల్లో ఆసక్తికర సీన్.. పరిటాల శ్రీరామ్‌ను హగ్ చేసుకున్న జేసీ..

అనంత రాజకీయాల్లో ఆసక్తికర సీన్ కనిపించింది. పరిటాల శ్రీరామ్, జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఆలింగనం చేసుకున్నారు. మాట్లాడుకున్నారు.

JC Diwakar Reddy- Paritala Shriram: అనంత రాజకీయాల్లో ఆసక్తికర సీన్.. పరిటాల శ్రీరామ్‌ను హగ్ చేసుకున్న జేసీ..
Paritala Ravi With Jc
Follow us

|

Updated on: Nov 10, 2021 | 1:11 PM

 JC Diwakar Reddy hugging Paritala Shriram: అనంత రాజకీయాల్లో ఆసక్తికర సీన్ కనిపించింది. పరిటాల శ్రీరామ్, జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఆలింగనం చేసుకున్నారు. మాట్లాడుకున్నారు. ఈ సీన్ చూసిన రాయలసీమ జనం మురిసిపోతున్నారు. ఆనంద పడుతున్నారు. అయితే ఇందులో స్పెషల్ ఏముందని చాలా మందికి డౌట్ రావచ్చు. ఎందుకంటే ఈ ఇద్దరూ టీడీపీ నాయకులే.. ఇందులో ప్రత్యేకత ఏముందన్నదే కదా మీకొచ్చిన డౌట్‌..  నిజమే. కానీ ఒక్కసారి ఈ రెండు కుటుంబాల గత చరిత్ర చూస్తే మాత్రం ఇది కచ్చితంగా ప్రత్యేక దృశ్యమే అని చెప్పాలి.

ఒకప్పుడు అనంత జిల్లాలో పరిటాల, జేసీ కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనేది. అప్పుడు జేసీ బ్రదర్స్‌ది కాంగ్రెస్‌. పరిటాల రవి వర్సెస్ జేసీ బ్రదర్స్. ఓ రేంజ్‌ హైవోల్టేజ్‌ పాలిటిక్స్ నడిచేవి. పరిటాల మర్డర్‌ విషయంలోనూ అప్పట్లో జేసీ ఫ్యామీలపై ఆరోపణలు వచ్చాయి. అయితేపరిస్థితులు మారాయి. జేసీ బ్రదర్స్‌ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత కూడా కొన్ని రోజులు విభేదాలు కొనసాగినా ఈ మధ్యే కాస్త చేంజ్‌ వచ్చింది. గతంలో జేసీ కుమారులను కలిశారు పరిటాల శ్రీరామ్‌.

తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి నారా లోకేష్ అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా ఆ సీన్ కనిపించింది. జిల్లా సరిహద్దులో లోకేష్‌కు స్వాగతం పలికేందుకు తాడిపత్రి మున్సిపల్ ఛైర్ పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడి చేరుకున్నారు. అదే సమయంలో అక్కడికి టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ అక్కడికి చేరుకున్నారు.

పరిటాల శ్రీరామ్ అక్కడున్న టీడీపీ నేతల్ని ఆప్యాయంగా పలకరించుకుంటూ ముందుకెళ్లారు. ఆ తర్వాత అక్కడే ఉన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి దగ్గరకు వెళ్లారు. ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు. శ్రీరామ్ భుజాలపై చేతులు వేసి కుశల ప్రశ్నలు వేశారు. ఇద్దరూ కలిసి లోకేష్ కోసం కొద్దిసేపు ఎదురు చూశారు. అంతే ఆత్మీయంగా రెస్పాండ్ అయ్యారు శ్రీరామ్. ఈ సీన్‌ ఇప్పుడు అనంత పాలిటిక్స్‌లో హాట్‌టాఫిగా మారింది..

ఈ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు దుమ్మురేపుతున్నాయి. అలాగే రాయల సీమలోని అన్ని రాజకీయ వర్గాలు ఖుషీ అవుతున్నారు. పరిటాల, జేసీ ఫ్యామిలీ ఓకే వేదిక మీదకు రావడం వల్ల మంచి మెసేజ్ ఇచ్చారని.. ఇది శుభపరిణామం అనే చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోంది. ఏదమైన అనంతపురం ప్రజలు మాత్రం మురిసి పోతున్నారు.

ఇవి కూడా చదవండి: Chanakya Niti: శత్రువును ద్వేషించకు స్నేహితుడిలా చూడు.. చాణక్యుడు చెప్పిన సక్సెస్ సీక్రెట్ ఇదే..

Mukesh Ambani Antilia Case: ముఖేష్ అంబానీ కుటుంబానికి ఎలాంటి ముప్పు లేదు.. చిరునామా అడిగిన వ్యక్తి ఎవరో తేల్చిన పోలీసులు..

Latest Articles