Telangana: కిషన్ రెడ్డికి దమ్ముంటే కేంద్రాన్ని నిలదీయాలి.. ధాన్యం కొనుగోలుపై మంత్రి సీరియస్ కామెంట్స్..
Telangana: వరి పంట విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై మంత్రి కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
Telangana: వరి పంట విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై మంత్రి కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కిషన్ రెడ్డికి దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం తీరును ప్రశ్నించాలని అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. సెప్టెంబర్ 1వ తేదీన కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఇంటికి వెళ్లి కలిసామన్నారు. తెలంగాణ పండించిన రైస్‌ను కొనుగోలు చేయమని కోరామని, 4 ఏళ్లకు సరిపడా బాయిల్డ్ రైస్ ఉందని, తాము తీసుకోమని పీయూష్ గోయల్ అన్నారని పేర్కొన్నారు. ‘ధాన్యం కొనుగోలు చేసి రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలంటే మాపైనే ఢిల్లీ వాళ్ళు మాట్లాడారు’ అని ఫైర్ అయ్యారు.
ఆ రోజు మాట్లాడని కిషన్ రెడ్డి.. ఇవ్వాళ గట్టిగా మాట్లాడుతున్నారంటూ మంత్రి నిరంజన్ నిప్పులు చెరిగారు. గన్ని బ్యాగ్‌లు ఇవ్వకుండా ప్రైవేట్‌లో కొనకుండా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి బెదిరింపులు తెలంగాణపై కాదని, తెలంగాణ సమాజాన్ని కించపరుస్తున్న పీయూష్ గోయల్, ఢిల్లీ ప్రభుత్వంపై చేయాలని మంత్రి అన్నారు. తెలంగాణ వరిని కొనేలా కేంద్రాన్ని బెదిరించాలన్నారు. రైతుల పట్ల కిషన్ రెడ్డికి బాధ్యత ఉంటే తమతో కలిసి ధర్నాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు గొంతు చించుకుని మాట్లాడుతున్న కిషన్ రెడ్డి.. ముందుగా వారి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను కంట్రోల్‌లో పెట్టుకోవాలని హితవుచెప్పారు. ముఖ్యమంత్రి అనే సోయి లేకుండా బండి సంజయ్ ఇష్టమొచ్చినట్లు విమర్శించారని మంత్రి పేర్కొన్నారు.
Also read:
Anasuya: రోల్ కోసం అవసరమైతే గుండు కొట్టించుకుంటా.. అనసూయ కామెంట్స్ వైరల్..