Telangana Govt Hospitals: సాధారణ కాన్పులపై తెలంగాణ సర్కార్ ఫోకస్.. ప్రభుత్వాస్పత్రుల్లో ‘మిడ్ వైఫరీ’ శిక్షణ..
Govt Hospitals: సాధారణ కాన్పులపై అవగాహనే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని స్టాఫ్ నర్సులకు ‘మిడ్ వైఫరీ’ శిక్షణ ఇస్తోంది ప్రభుత్వం. ఈ శిక్షణలో భాగంగా నార్మల్ డెలివరీ..
Govt Hospitals: సాధారణ కాన్పులపై అవగాహనే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని స్టాఫ్ నర్సులకు ‘మిడ్ వైఫరీ’ శిక్షణ ఇస్తోంది ప్రభుత్వం. ఈ శిక్షణలో భాగంగా నార్మల్ డెలివరీ కోసం గర్భిణి స్త్రీలతో వ్యాయామం చెప్పిస్తున్నారు నర్సులు. అభివృద్ధి చెందిన దేశాల్లోనే అమల్లో ఉండే ఈ విధనాన్ని ప్రస్తుతం తెలంగాణ రాష్టంలో అమలుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఫైలెట్ ప్రాజెక్ట్ కింద ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్, సంగారెడ్డి ఆస్పత్రులు ఎంపీక చేశారు.
పురిటి నొప్పులతో పునర్జన్మ ఇవ్వడానికి, మరో ప్రాణిని ఈ లోకంలోకి చేరవేసే మాతృమూర్తికి ప్రసవ వేదన బాధగా వుండొద్దని, వారికి సాధారణ ప్రసవాలు మాత్రమే కలగాలని వినూత్న తరహాలో ప్రసవాలు చేస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది. సంగరెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రితో పాటు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సాధారణ ప్రసవాలకు నడుం బిగించారు. ఆడవారికి అమ్మతనం దేవుడిచ్చిన గొప్పవరం. ప్రపంచంలో ఒక ప్రాణిని సృష్టించాలి అంటే కేవలం ఇద్దరికి సాధ్యం. ఒకటి దైవం, రెండు అమ్మ. నవమాసాలు మోసి బిడ్డకు జన్మనివ్వడంతో పాటు తాను కూడా పునర్జన్మ పొందుతుంది. అటువంటి గర్భస్థ సమయంలో ప్రసవ సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సాధారణ ప్రసవం అయ్యేందుకు వారిచే చిన్న, చిన్న వ్యాయామాలు (మిడ్ వైఫరీ శిక్షణ..)చేయిస్తూ వారికి సిజేరియన్ కాకుండా సాధారణ ప్రసవాలు కలిగే విధంగా ప్రోత్సహిస్తున్నారు ఆయా ఆసుపత్రుల సిబ్బంది.
సాధారణ ప్రసవాలు జరగడానికి ముందుగా ప్రసవానికి సిద్ధంగా ఉన్న మహిళలకు వ్యాయామాలు నేర్పిస్తున్నారు ఆస్పత్రి సిబ్బంది. మిడ్ వైఫరీ శిక్షణ తీసుకున్న నర్సులు, గర్భిణీ స్త్రీల చేత బాల్ ఎక్సర్సైజ్, వాకింగ్ ఎక్సర్సైజ్, సిట్టింగ్ లాంటి చిన్న, చిన్న వ్యాయమలు చేపిస్తు వారిని సిజేరియన్ కు దూరం చేస్తూ, సాధారణ ప్రసవాలు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలోనే అధిక నార్మల్ డెలివరీలు చేస్తున్న ఘనత సంగరెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిదే అని అక్కడి సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also read: