Mahabubabad MLA: టైమ్ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. విపక్షాలకు ఎమ్మెల్యే షాకింగ్ సవాల్..

MLA Shankar Naik: టైం నువ్వు చెప్పినా సరే, లేదా నన్ను చెప్పమన్నా సరే, మహబూబబాద్ నెహ్రూ సెంటరా? లేక గూడూరు అంబేద్కర్ సెంటరా ? అని ఓ ఎమ్మెల్యే..

Mahabubabad MLA: టైమ్ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. విపక్షాలకు ఎమ్మెల్యే షాకింగ్ సవాల్..
Mla Shankar Naik
Follow us

|

Updated on: Nov 10, 2021 | 9:48 AM

MLA Shankar Naik: టైం నువ్వు చెప్పినా సరే, లేదా నన్ను చెప్పమన్నా సరే, మహబూబబాద్ నెహ్రూ సెంటరా? లేక గూడూరు అంబేద్కర్ సెంటరా ? అని ఓ ఎమ్మెల్యే ప్రతిపక్షాలకు చాలేంజ్ విసిరారు. ఉద్దెర మాటలు, పస లేని మాటలు మాట్లాడటం కాదు.. దమ్ముంటే చర్చకు రావాలే.. అని చాలేంజ్ చేశారు ఆ ఎమ్మెల్యే. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆ ఛాలెంజ్ కథ ఏంది? ప్రతిపక్షాలపై ఆయన ఎందుకంత గుస్సా అయ్యారు? ఇప్పుడు తెలుసుకుందాం..

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు శివారు పాటిమీదిగూడెంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఒక్కసారే 50 రెండు పడక గదుల ఇళ్ళను మంజూరు చేశారు. కొద్దిరోజుల కిందట ఇదే గ్రామ బొడ్రాయి మీద ప్రమాణం చేసి హామీ ఇచ్చిన ఎమ్మెల్యే, అన్నట్టుగానే మాట నిలబెట్టుకుని 50 ఇళ్ళు మంజూరు చేసి తన కమిట్‌మెంట్‌ను నిరూపించుకున్నారు. ఇళ్లు మంజూరి చేసిన లెటర్‌తో గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే, గాజులగట్టు ను దత్తత తీసుకున్నానని ప్రకటించారు.

ఈ సందర్బంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై తనదైన శైలిలో శివాలెత్తారు. తనపై విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ గల్లీలో లేదు, ఢీల్లిలో లేదని ఎద్దేవా చేశారు. మహబూబబాద్ జిల్లాలో సర్పంచ్ కు వచ్చిన ఓట్లు కూడ హుజురాబాద్ లో రాలేదని విమర్శించారు. ‘మీ ఊరు బొడ్రాయి మీద ప్రమాణం చేసి 50 డబుల్ బెడ్ రూం ఇళ్ళు కట్టిస్తానని హామీ ఇచ్చిన, ఇచ్చిన మాట ప్రకారం వారం రోజుల లోగా 50 ఇళ్ళు మంజూరీ చేసినట్లు లెటర్ పట్టుకొచ్చిన, శంకర్ నాయక్ అంటేనే మాట మీద నిలబడుతాడు’ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ‘‘పాటిమీదిగూడెంలోనీ ఈ వేదిక నుండీ బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళకు సవాల్ విసిరుతున్నా.. మీకు సిగ్గు శరం ఉంటే, మీకు లజ్జ ఉంటే, మీరు మనుషులైతే, మహబూబాబాద్ నియోజకవర్గంలో మీ హాయాంలో, మా హయాంలో జరిగిన అభివృద్దిపై చర్చకు సిద్ధమా? టైం మీరు చెప్పినా సరే, లేదా నన్ను చెప్పమన్నా సరే, మహబూబాబాద్ నెహ్రూ సెంటరా? లేక గూడూరు అంబేద్కర్ సెంటరా? నేను చర్చకు రెడీ ! మీరు సిద్దమా?’’ అని గట్టిగానే చాలేంజ్ చేశారు ఎమ్మెల్యే శంకర్ నాయక్.

ప్రతిపక్షాలు వారి స్థాయిని మరచి, సీఎం కేసీఆర్‌ను దుర్భాషలాడుతున్నారని, నోరు జారితే మీ తాట తీస్తానని శంకర్ నాయక్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. తాను 50 ఎకరాలు ఆక్రమించానని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారని, తానెక్క ఆక్రమించానో చూపిస్తే ఆ యాభై ఎకరాలు వాళ్లకే రాసిస్తానని స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. బీజేపీ నేతలకు దమ్ము ధైర్యం ఉంటే తాను ఆక్రమించిన భూములు ఎక్కడో చూపించాలన్నారు. గతంలో కాంగ్రెస్ వాళ్ళు కూడ ఇలాగే ఆరోపించి, నిరూపించలేకపోయారన్నారు. తనపై ఆరోపణ చేసేటప్పుడు ఒకటికి వందసార్లు ఆలోచించుకోవాలన్నారు. నిరూపించే దమ్ము ఉంటేనే తనపై ఆరోపణలు చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే శంకర్ నాయక్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Also read:

CM Jagan Meet CM Naveen Patnaik: సీఎంల భేటీతో సరికొత్త అధ్యాయం.. ఏపీ ఒరిస్సా మధ్య స్పష్టత లేని జనాలు.. (వీడియో)

Telangana MLC Elections: తెలంగాణ ప్రభుత్వానికి ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీల సంఘం వార్నింగ్.. ఏ విషయంలో అంటే..

Weight Loss: బరువు తగ్గాలంటే కడుపు మాడ్చుకోనవసరం లేదు.. చక్కని తిండి తింటూనే స్లిమ్‌గా కావొచ్చు..ఎలా అంటారా?