AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss: బరువు తగ్గాలంటే కడుపు మాడ్చుకోనవసరం లేదు.. చక్కని తిండి తింటూనే స్లిమ్‌గా కావొచ్చు..ఎలా అంటారా?

బరువు తగ్గడానికి.. మనల్ని మనం ఫిట్‌గా ఉంచుకోవడానికి ఏమి చేయాలి? ఆహార నియంత్రణ నుండి వ్యాయామాల వరకు, మనల్ని ఆరోగ్యంగా.. ఫిట్‌గా ఉంచడానికి మనం చేయగలిగినదంతా చేస్తాము.

Weight Loss: బరువు తగ్గాలంటే కడుపు మాడ్చుకోనవసరం లేదు.. చక్కని తిండి తింటూనే స్లిమ్‌గా కావొచ్చు..ఎలా అంటారా?
Weight Loss Flour
KVD Varma
|

Updated on: Nov 10, 2021 | 9:46 AM

Share

Weight Loss: బరువు తగ్గడానికి.. మనల్ని మనం ఫిట్‌గా ఉంచుకోవడానికి ఏమి చేయాలి? ఆహార నియంత్రణ నుండి వ్యాయామాల వరకు, మనల్ని ఆరోగ్యంగా.. ఫిట్‌గా ఉంచడానికి మనం చేయగలిగినదంతా చేస్తాము. నిపుణులు ఎప్పటికప్పుడు ఆరోగ్యకరమైన జీవితానికి సంబంధించిన చక్కని చిట్కాలను చెబుతుంటారు. ముఖ్యంగా బరువు తగ్గడానికి సంబంధించి నిపుణులు చెప్పే చిట్కాలు ఉపయోగకరంగా ఉంటాయి. అటువంటి వాటిలో వివిధ రకాల ఆహార ధాన్యాల రోటీలు తినడం ద్వారా బరువు ఎలా తగ్గోచ్చో నిపుణులు చెప్పిన కొన్ని విషయాలు తెలుసుకుందాం.

బాదం పిండి – బరువు తగ్గడానికి..శక్తివంతంగా ఉండటానికి బాదం పిండి మంచి ఎంపిక. విటమిన్ ఎ, మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ పిండిలో సోడియం ఉండదు. అలాగే ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఏ ఆహార పదార్ధం శరీరంలో ఎంత చక్కెరను పెంచుతుందో గ్లైసెమిక్ సూచిక చెబుతుంది. ఈ సూచికలో ఈ పిండి చివరి వరుసలో ఉంటుంది కాబట్టి, దీన్ని తినడం వల్ల శరీరంలో చక్కెర ఎక్కువగా పెరగదని నిపుణులు నిర్ధారించారు.

ఓట్స్ పిండి – ఓట్ రోటీలలో ఫైబర్, ఐరన్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. దాని రొట్టె తినడం ద్వారా జీర్ణక్రియ సరిగ్గా ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే ఈ పిండిని గోధుమ పిండికి బదులుగా తింటే, త్వరగా బరువు తగ్గుతుంది.

చియా గింజల పిండి – చియా గ్రైండింగ్ నుండి తయారైన పిండిలో జింక్, ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఒమేగా ఉన్నాయి. ఇది శరీర రోజువారీ అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ పిండితో చేసిన రోటీలు మధుమేహ రోగులకు కూడా మేలు చేస్తాయి. బరువు తగ్గడంతో పాటు, జుట్టు.. చర్మాన్ని చక్కగా మెయింటెయిన్ చేయడంలో కూడా సహాయపడుతుంది.

రాజ్‌గిర పిండి – ఈ పిండి ప్రత్యేకత ఏమిటంటే ఇందులో తక్కువ కొవ్వు, సోడియం ఉండటం వల్ల బరువు పెరగదు. ఇందులో ప్రొటీన్లు, కాల్షియం అధికంగా ఉంటాయి. ఈ పిండి రోటీ సులభంగా జీర్ణమవుతుంది. విటమిన్లు కె, సి పుష్కలంగా ఉండే ఈ పిండి రోటీ ఫిట్‌గా ఉండటానికి మంచి ఎంపిక.

సోయాబీన్ పిండి – ఇందులో మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఈ పిండి ఇతర పిండిలాగా బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఈ పిండిలో ప్రొటీన్, పీచు, విటమిన్ కె, ఫోలేట్, విటమిన్ బి, విటమిన్ బి6 పుష్కలంగా లభిస్తాయి. బరువు తగ్గడానికి ఈ పిండి రోటీ కూడా మంచి ఎంపిక.

ఈ పిండివంటలన్నింటి ప్రత్యేకత ఏంటంటే.. ఎలాంటి శ్రమ లేకుండా సులువుగా సిద్ధం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. దీనికి వేరే పిండి కలపాల్సిన అవసరం లేదు. మంచి ఆరోగ్య ఫలితాలను పొందడానికి, ఏదైనా ఒక రకమైన పిండిపై ఆధారపడకండి, పైన పేర్కొన్న అన్ని రకాల పిండిని వాడటం కొనసాగించండి. మీరు గ్లూటెన్‌కు అలెర్జీ అయితే లేదా మీ వైద్య చరిత్రపై ఏవైనా సందేహాలు ఉంటే, ఏదైనా ఆహారం ప్రారంభించే ముందు డైటీషియన్‌ను సంప్రదించండి.

ఇవి కూడా చదవండి: Smart Watch: భారత్‌ మార్కెట్లో స్మార్ట్‌వాచ్‌ల హవా.. ఆ రెండు కంపెనీల జోరు.. మరిన్ని అమ్మకాల దిశలో పరుగులు!

COP26 Summit: ఐక్యరాజ్యసమితి కాప్26 సమ్మిట్ కోసం.. అతి చిన్న దేశం.. వినూత్నంగా సందేశం.. ఆలోచింపచేస్తున్న ప్రయత్నం!

Malala Marriage: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా వివాహం..సోషల్ మీడియాలో ప్రకటన!

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌