AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: డయాబెటిస్‌తో చక్కెరకు దూరంగా ఉంటున్నారా? పంచదారలానే ఉండే ఆరోగ్యం పాడు చేయని తీపి పదార్ధాలు ఇవే!

పంచదారతో మన బంధం ఆసక్తికరంగా ఉంటుంది..మన ఆహారంలో తీపి చెక్కుచెదరకుండా ఉండాలంటే అది మనకు అవసరం. అయితే, ఎంత ఇష్టమైనా ఒక్కోసారి మనం కూడా దానికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాము.

Diabetes: డయాబెటిస్‌తో చక్కెరకు దూరంగా ఉంటున్నారా? పంచదారలానే ఉండే ఆరోగ్యం పాడు చేయని తీపి పదార్ధాలు ఇవే!
Diabetes
KVD Varma
|

Updated on: Nov 10, 2021 | 9:17 AM

Share

Diabetes: పంచదారతో మన బంధం ఆసక్తికరంగా ఉంటుంది..మన ఆహారంలో తీపి చెక్కుచెదరకుండా ఉండాలంటే అది మనకు అవసరం. అయితే, ఎంత ఇష్టమైనా ఒక్కోసారి మనం కూడా దానికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాము. ఎందుకంటే రక్తంలో అధిక ‘తీపి’ కరిగిపోకపోవడం మధుమేహానికి దారి తీసే అతిపెద్ద ప్రమాదం ఉందని. అందుకే, ప్రపంచంలో దాదాపు 37 శాతం మంది ‘చీనీ కమ్’ మార్గాన్ని ఎంచుకున్నారు. మార్కెట్ రీసెర్చ్ సంస్థ యూరోమానిటర్ చేసిన సర్వే ప్రకారం, చక్కెర మితిమీరిన వినియోగంపై ప్రజలు అవగాహన పెంచుకుంటున్నారు.

చక్కెరతో మధుమేహం, స్థూలకాయం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతోంది. ఈ అవగాహన ఉన్నప్పటికీ, ప్రజలకు చక్కెరకు సమర్థవంతమైన ప్రత్యామ్నాయం లేదు. అమెరికాలోనే 60 శాతానికి పైగా ఆహార పానీయాల ఉత్పత్తులలో చక్కెర జోడించి ఉంటోందని మరో అధ్యయనం సూచిస్తుంది. ఎవరైనా చక్కెరను వదులుకోవాలనుకుంటే, పూర్తిగా వదులుకోలేరు. మధుమేహం ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ.. తీపి లేకుండా ఉండటం అన్నివేళల్లో కొంతమందికి అసలు సాధ్యం కాదు. అందుకే చక్కెరకు ప్రత్యామ్నాయం ఉంటె బావుండునని అందరూ కోరుకుంటారు. అంటే.. చక్కెర అంత తీయగా ఉండాలి.. కానీ, అది మధుమేహం పెరుగుదల ప్రమాదాన్ని తీసుకురాకూడదు. అయితే, ఈ ఆందోళనకు పరిష్కారం ఎంతో దూరంలో లేదని నిపుణులు చెబుతున్నారు.

చాలా పెద్ద కంపెనీలు చక్కెరకు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నాయి. ప్రస్తుతం, మాపుల్ సిరప్, ఖర్జూరం, కొబ్బరి చక్కెర, స్టెవియా ఎక్స్‌ట్రాక్ట్..సింథటిక్ స్వీటెనర్‌ల వంటి ప్రత్యామ్నాయాలు తేనె, బెల్లం వంటి సాంప్రదాయ పదార్ధాలు.. స్వీటెనర్‌లకు అదనంగా ఉపయోస్తున్నారు. వీటన్నింటి మధ్య, అల్లులోస్, ఇన్‌క్రెడో, సప్లాంట్ వాడకం వేగంగా పెరిగింది. అయినప్పటికీ, ‘హౌ నాట్ టు డైట్’ పుస్తక రచయిత డాక్టర్ మైఖేల్ గ్రెగర్, వాటి ప్రభావం అధ్యయనం చేయడం జరగలేదని చెబుతున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన డాక్టర్ లుస్టిగ్, ‘ఈ ఎంపికలను ప్రయత్నించడం కంటే స్వీట్లపై ఉన్న కోరికను వదులుకోవడం మంచిది’ అని చెప్పారు.

మూడు ఎంపికలు… వీటిలో తీపి, క్యాలరీలు చక్కెర కంటే తక్కువగా ఉంటాయి కాబట్టి శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరగకుండా చూసుకోండి.

1. అల్లులోజ్: గోధుమలలో సంభవిస్తుంది. చక్కెర కంటే మూడింట ఒక వంతు తీపి మరియు 10 రెట్లు తక్కువ కేలరీలు. ఇది బ్యాక్టీరియాను కూడా సృష్టించదు. అందువల్ల పళ్లలో పురుగులు వచ్చే అవకాశం ఉండదు. చాలా అల్లులోజ్ శరీరం నుండి మూత్రం ద్వారా విసర్జించబడుతుంది. రక్తంలో గ్లూకోజ్‌ని పెంచదు.

2. ఇన్‌క్రెడో: చక్కెర అణువులకు చక్కటి రవ్వ (బేకింగ్‌లో ఉపయోగపడుతుంది) జోడించడం ద్వారా ఇజ్రాయెల్ కంపెనీ తయారు చేసింది. దీని కారణంగా, శరీరంలోని చక్కెర అణువులు విచ్ఛిన్నం చేయడం ప్రారంభించాయి. ఇది మునుపటి కంటే త్వరగా వారి రుచిని ఇస్తుంది. చాలా తక్కువ పరిమాణంలో పనిని పూర్తి చేస్తుంది.

3. సప్లాంట్: ఇది మొక్కలలో ఉండే సహజ స్వీటెనర్ల మిశ్రమం. మొక్కజొన్న గింజలు, బార్లీ ఫైబర్, గోధుమ ఊకలను గ్రైండ్ చేయడం ద్వారా దీనిని తయారు చేస్తారు. ఇందులో కేలరీలు చాలా తక్కువ. రక్తంలో గ్లూకోజ్‌ని నెమ్మదిగా పెంచుతుంది. ఇది చక్కెర కంటే త్వరగా విచ్ఛిన్నం అవుతుంది కరిగిపోతుంది.

ఇవి కూడా చదవండి: Smart Watch: భారత్‌ మార్కెట్లో స్మార్ట్‌వాచ్‌ల హవా.. ఆ రెండు కంపెనీల జోరు.. మరిన్ని అమ్మకాల దిశలో పరుగులు!

COP26 Summit: ఐక్యరాజ్యసమితి కాప్26 సమ్మిట్ కోసం.. అతి చిన్న దేశం.. వినూత్నంగా సందేశం.. ఆలోచింపచేస్తున్న ప్రయత్నం!

Malala Marriage: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా వివాహం..సోషల్ మీడియాలో ప్రకటన!