cholesterol: మీరు కొలెస్ట్రాల్‎తో బాధపడుతున్నారా.. అయితే ఇవి పాటించండి..

ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. వారు శరీరంలో కొవ్వు పెరిగిపోయి ఇబ్బంది పడుతుంటారు. ఈ కొలెస్ట్రాల్‎ను తగ్గించుకోవడానికి చాలా మంది పాట్లు పడుతుంటారు....

cholesterol: మీరు కొలెస్ట్రాల్‎తో బాధపడుతున్నారా.. అయితే ఇవి పాటించండి..
Fat
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 09, 2021 | 10:51 PM

ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. వారు శరీరంలో కొవ్వు పెరిగిపోయి ఇబ్బంది పడుతుంటారు. ఈ కొలెస్ట్రాల్‎ను తగ్గించుకోవడానికి చాలా మంది పాట్లు పడుతుంటారు. అయితే ఈ కొవ్వు తగ్గించుకోవాలంటే కొన్ని సూచనలు పాటించాల్సిందే. మన శరీరానికి కొలెస్ట్రాల్‌ అత్యవసరం. మితిమీరితేనే.. ముఖ్యంగా చెడ్డ కొలెస్ట్రాల్‌ ఎక్కువైతేనే ప్రమాదం. దీంతో గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ముప్పు ఎక్కువవుతుంది. అదే మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) రక్తంలోంచి చెడ్డ కొలెస్ట్రాల్‌ను తొలగించటానికి తోడ్పడుతుంది.

శరీర బరువు పెరుగుతున్న కొద్దీ కొలెస్ట్రాల్‌ స్థాయులూ పెరిగే ప్రమాదముంది. అధిక రక్తపోటు, మధుమేహం ముప్పులూ ఎక్కువ అవుతాయి. ఇవి రక్తనాళాల గోడలను దెబ్బతీసి పూడికలు ఏర్పడేలా చేస్తాయి. కాబట్టి బరువు అదుపులో ఉంచుకోవటం.. ముఖ్యంగా బొజ్జ తగ్గించుకోవటం ఎంతైనా అవసరం. దీంతో కొలెస్ట్రాల్‌ తగ్గటం సహా మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. చేపల్లో ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు దండిగా ఉంటాయి. ఇవి రక్తంలో ట్రైగ్లిజరైడ్లనే కొవ్వు, మొత్తం కొలెస్ట్రాల్‌ తగ్గటానికి తోడ్పడతాయి. రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటాన్ని నివారిస్తాయి. కాబట్టి కొవ్వుతో కూడిన సాల్మన్‌, టూనా, సార్‌డైన్‌ వంటి చేపలను తరచూ తినటం మంచిది. వీటిని కూరగానో, ఉడికించో తినాలి గానీ నూనెలో వేయించటం మంచిది కాదు.

ప్రతి రోజు ఉదయం అల్పాహారంగా దంపుడు బియ్యం, సజ్జలు, జొన్నలు, ఓట్స్‌, మొలకెత్తిన విత్తనాలు వంటివి తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. ఇవి ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. మధ్యాహ్నం తక్కువ తినేలా చేస్తాయి. చిరుతిండి మీదికి మనసు లాగుతోందా? అయితే గుప్పెడు బాదం పప్పు, కాజు, పిస్తా, అక్రోట్ల వంటివి తిని చూడండి. వీటిల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించే కొవ్వులు దండిగా ఉంటాయి. కాకపోతే వీటిని మితంగానే తీసుకోవాలి. రోజుకు 30 గ్రాముల గింజపప్పులు తినేవారికి గుండెజబ్బుల ముప్పు తగ్గుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

ఆహారంలో కొవ్వు పదార్థాలు తగుపాళ్లలో ఉండేలా చూసుకోవటం తప్పనిసరి. పొద్దు తిరుగుడు, తవుడు, వేరుశనగ, ఆలివ్‌ నూనెల వంటి అసంతృప్త కొవ్వులు శరీరానికి మేలు చేస్తాయి. ఇవి చెడ్డ కొలెస్ట్రాల్‌ తగ్గటానికి, మంచి కొలెస్ట్రాల్‌ పెరగటానికి తోడ్పడతాయి. అదే మాంసం, వెన్న తీయని పాలు, వెన్న, పామాయిల్‌, డాల్డ వంటి సంతృప్త కొవ్వులైతే చెడ్డ కొలెస్ట్రాల్‌ పెరిగేలా చేస్తాయి. రోజుకు అరగంట వ్యాయామం చేసినా కొలెస్ట్రాల్‌ తగ్గటానికి తోడ్పడుతుంది. శరీర సామర్థ్యాన్ని బట్టి ఇంకాస్త ఎక్కువసేపు చేసినా మేలే. కాస్త వేగంగా నడవటం వంటి గుండెకు పని చెప్పే వ్యాయామాలు గుండె జబ్బు, పక్షవాతం ముప్పు తగ్గేలా చేస్తాయి. బరువూ తగ్గుతుంది.విశ్రాంతి మంత్ర: అదేపనిగా ఒత్తిడికి గురైతే రక్తపోటు పెరుగుతుంది. కొలెస్ట్రాల్‌ మోతాదులూ ఎక్కువ కావొచ్చు.

Read Also… అలసట, నీరసం తరచుగా వస్తే ఆ వ్యాధికి గురైనట్లే..! వెంటనే ఈ విషయాలు తెలుసుకోండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో