Sleeping Time: మన నిద్రకూ గుండెపోటుకు మధ్య సంబంధం ఉంది.. రాత్రి ఎక్కువ సమయం మేల్కొంటే ఏం జరుగుతుందంటే..
మీరు గుండెపోటు.. స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించుకోవాలనుకుంటే, రాత్రి 10 నుండి 11 గంటల మధ్య నిద్రపోండి. శాస్త్రవేత్తలు ఈ సమయాన్ని 'గోల్డెన్ అవర్' అని పిలుస్తారు.
Sleeping Time: మీరు గుండెపోటు.. స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించుకోవాలనుకుంటే, రాత్రి 10 నుండి 11 గంటల మధ్య నిద్రపోండి. శాస్త్రవేత్తలు ఈ సమయాన్ని ‘గోల్డెన్ అవర్’ అని పిలుస్తారు. ఒక వ్యక్తి నిద్రించే సమయం.. గుండె జబ్బుల మధ్య సంబంధం కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ముఖ్యంగా ఆలస్యంగా నిద్రపోయే మహిళల్లో స్ట్రోక్ ప్రమాదం ఎక్కువ ఉందని వారు చెబుతున్నారు. ఇంగ్లండ్‌లోని యూనివర్శిటీ ఆఫ్ ఎక్సెటర్ పరిశోధకులు తమ తాజా పరిశోధనలో ఈ వాదనను వినిపించారు. మీరు అర్ధరాత్రి లేదా చాలా ఆలస్యంగా నిద్రపోతే, అప్పుడు గుండె దెబ్బతింటుందని పరిశోధకులు అంటున్నారు.
మనిషి నిద్ర – గుండె జబ్బుల మధ్య సంబంధం..
పరిశోధకులు మనిషి నిద్ర – గుండె జబ్బుల మధ్య సంబంధం కచ్చితంగా ఉందని అంటున్నారు. ఆలస్యంగా నిద్రించే వారు ఉదయం ఆలస్యంగా మేల్కొంటారు. వారి శరీర గడియారం చెదిరిపోతుంది. గుండెపై చెడు ప్రభావం ఉంటుంది. అందువల్ల రాత్రిపూట త్వరగా నిద్రపోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
88 వేల మందిపై పరిశోధన..
పరిశోధకులు 43 నుంచి 74 ఏళ్ల మధ్య 88 వేల మంది బ్రిటీష్ పెద్దలపై పరిశోధన చేశామని చెబుతున్నారు. పరిశోధనలో పాల్గొన్న వ్యక్తుల చేతుల్లో ట్రాకర్ ధరించారు. వారి నిద్ర, మేల్కొనే కార్యాచరణను ట్రాకర్ ద్వారా పర్యవేక్షించారు. దీంతోపాటు వారి నుంచి జీవనశైలికి సంబంధించిన ప్రశ్నలు, సమాధానాలు కూడా అడిగారు.
అలాంటి వారిలో గుండె జబ్బులు, గుండెపోటు, పక్షవాతం, గుండె ఆగిపోవడం వంటి వాటి వైద్య రికార్డులను 5 ఏళ్లపాటు ఉంచి పోల్చారు. పరిశోధన ఫలితాలు ప్రతి రాత్రి 10 -11 గంటల మధ్య నిద్రపోవడం ప్రారంభించిన రోగులకు గుండె జబ్బులు తక్కువగా ఉన్నాయని పరిశోధన ఫలితాలు చూపిస్తున్నాయి. అదే సమయంలో, అర్ధరాత్రి తర్వాత నిద్రపోయే వ్యక్తులలో ఈ ప్రమాదం 25 శాతం వరకు ఎక్కువగా ఉంటుంది.
నిద్ర శరీర గడియారం చెడిపోకుండా నిరోధిస్తుంది
యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం, త్వరగా నిద్రపోవడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. శరీరంలోని అంతర్గత గడియారం 24 గంటలూ సక్రమంగా నడుస్తుంటే మనల్ని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుందని పరిశోధకుడు డాక్టర్ డేవిడ్ ప్లేన్స్ చెప్పారు. దీనిని సిర్కాడియన్ రిథమ్ అంటారు. ఆలస్యంగా నిద్రపోవడంతో సిర్కాడియన్ రిథమ్ మరింత దిగజారుతుంది. కాబట్టి దాన్ని మెరుగుపరచాలని ఆయన అంటున్నారు.
ఇవి కూడా చదవండి: Smart Watch: భారత్ మార్కెట్లో స్మార్ట్‌వాచ్‌ల హవా.. ఆ రెండు కంపెనీల జోరు.. మరిన్ని అమ్మకాల దిశలో పరుగులు!
Malala Marriage: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా వివాహం..సోషల్ మీడియాలో ప్రకటన!