Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga Poses: అందంగా కనిపించాలా? అయితే 3 యోగాసనాలు క్రమం తప్పకుండా చేయండి..

Yoga Poses: ఆరోగ్యకరమైన, అందమైన చర్మం కోసం ప్రతిరోజూ రసాయనాలు అధికంగా ఉండే ఫేస్ క్రీమ్స్, ఇతర లిక్విడ్స్ ఉపయోగిస్తుంటారు. ఇవి ఒక్కోసారి చర్మానికి

Yoga Poses: అందంగా కనిపించాలా? అయితే 3 యోగాసనాలు క్రమం తప్పకుండా చేయండి..
Yoga
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 10, 2021 | 10:06 AM

Yoga Poses: ఆరోగ్యకరమైన, అందమైన చర్మం కోసం ప్రతిరోజూ రసాయనాలు అధికంగా ఉండే ఫేస్ క్రీమ్స్, ఇతర లిక్విడ్స్ ఉపయోగిస్తుంటారు. ఇవి ఒక్కోసారి చర్మానికి హానీ కలిగించే ప్రమాదమూ ఉంది. అందుకే ఆరోగ్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆరోగ్యకరమైన చర్మ సౌందర్యం కోసం యోగా చేయాలని సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా యోగా చేస్తే అందంగా కనిపించడంతో పాటు.. ఆరోగ్యం కూడా సొంతమవుతుంది. ముఖ్యంగా మూడు రకాల ఆసనాలు అందాన్ని పెంచుతాయని చెబుతున్నారు. మరి ఆ మూడు రకాల యోగాసనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

శిర్షాసనం : శీర్షాసనంలో తల కిందుగా ఉండాలి. ఒక చాప తీసుకుని, దానిపై తలకిందులుగా ఉండాలి. తల వెనుకవైపు చేతులు జోడించి ఉంచి.. కాళ్లను నిటారుగా పైకి పెట్టాలి. ఈ పొజిషన్‌లో కాసేపు ఉండి.. ఊపిరి పీలుస్తూ, వదులుతూ ఉండాలి.

Yoga Pose 1

హలాసనం : ఈ ఆసనం వేసే ముందు వెల్లకిలా పడుకోవాలి. అర చేతులను నేలకు స్పృశిస్తూ ఉంచాలి. ఆ తరువాత పాదాలను నెమ్మదిగా పైకి లేపాలి. అలా పాదలను తల వెనుకవైపునకు తీసుకువచ్చి.. మీ ఛాతి మీ గడ్డానికి వీలైనంత దగ్గరగా తీసుకురావాలి. ఈ భంగిమలో కాసేపు ఉండి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ, వదులుతూ ఉండాలి.

Yoga Pose 2

సర్వంగాసనం: ముందుగా వెల్లకిలా పడుకోవాలి. ఆ తరువాత మీ పాదాలను నెమ్మదిగా పైకి లేపాలి. పాదాలు ఆకాశం వైపు చూసేలా ఉంచాలి. తుంటి భాగాన్ని సైతం పైకి లేపాలి. మీ అరచేతులతో సాయంతో నడుమును పైకి లేపినట్లుగా పట్టుకోవాలి. మీ భుజాలు, మొండెం, కటి, కాళ్లు సమలేఖంగా ఉంచేలా ప్రయత్నించాలి. మీ దృష్టిని పాదాలపై కేంద్రీకరించాలి. అలా ఉచ్చాశ్వ, నిశ్వాసలను సాగిస్తూ కాసేపు ఉండాలి.

Yoga Pose 3

Also read:

Telangana: కిషన్ రెడ్డికి దమ్ముంటే కేంద్రాన్ని నిలదీయాలి.. ధాన్యం కొనుగోలుపై మంత్రి సీరియస్ కామెంట్స్..

Telangana Govt Hospitals: సాధారణ కాన్పులపై తెలంగాణ సర్కార్ ఫోకస్.. ప్రభుత్వాస్పత్రుల్లో ‘మిడ్ వైఫరీ’ శిక్షణ..

Anasuya: రోల్ కోసం అవసరమైతే గుండు కొట్టించుకుంటా.. అనసూయ కామెంట్స్ వైరల్..