Health Tips: మీరు ఉదయం లేవగానే ఈ పనులు చేస్తున్నారా..? జాగ్రత్త.. మీ మూడ్‌ను పాడు చేస్తాయి..!
Health Tips: ప్రస్తుతమున్న కాలంలో ఏదో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. అందుకు కారణం జీవనశైలి విధానం. మానసిక ఆందోళన..
Health Tips: ప్రస్తుతమున్న కాలంలో ఏదో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. అందుకు కారణం జీవనశైలి విధానం. మానసిక ఆందోళన, తినే ఆహారం, కాలుష్యం, ఇతర ఒత్తిళ్లు తదితర కారణాల వల్ల వివిధ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఇక చాలా మంది ఉదయం నిద్రలేవగానే మొబైల్‌లో మునిగి తేలుతుంటారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్ చాటింగ్‌లు, వీడియోలు చూడటం ఇలా ఎన్నో రకాలుగా ఫోన్‌లలోనే మునిగి తేలుతుంటారు. ఉదయం లేవగానే సోషల్ మీడియాలో ఏం పోస్టులు వచ్చాయో చూసుకుంటారు. ఆ తర్వాత కొందరు యథావిధిగా తమ కార్యకలాపాలను ప్రారంభిస్తారు. ఉదయం నిద్రలేవగానే ఫోన్లకు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. అయితే ఇలాంటివి చేయడం వల్ల మీ మూడ్‌ను పాడు చేయడమే కాకుండా మీరు రోజు హుషారుగా ఉండలేరని చెబుతున్నారు నిపుణులు. అందుకే ఉదయం వాటిని ఉపయోగించకూడదంటున్నారు.
మీ ముఖాన్ని 20 సెకన్ల పాటు అద్దంలో చూసుకొని నవ్వండి:
నిపుణులు చెబుతున్న దాని ప్రకారం చూస్తే.. ప్రతి ఒక్కరు ఉదయం లేవగానే కనీసం 20 సెకన్లపాటు మీ ముఖాన్ని చూసుకుని నవ్వుకోండి. అలాగే నిద్రలేవగానే ఏదైనా ఒక జోక్ చదవండి. నిద్రలేవగానే వెంటనే ఇంట్లో అందరికీ, కుదిరితో పక్కనున్న వారికి గుడ్‌మార్నింగ్ చెప్పండి. ఇది మీ మూడ్‌ను ఉత్సాహంగా ఉంచేలా చేస్తుంది. నిద్రలేవగానే కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దంగా కళ్లు మూసుకుని కూర్చోని, ఊపిరి బాగా లోపలికి పీల్చుకుని వదిలితే ఈ అలవాటు శ్వాసక్రియ మీ మూడ్‌ను ఉత్సాహంగా ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
లేవగానే నిమ్మకాయ నీళ్లు..
రిలాక్సేషన్ కోసం నిద్రలేవగానే చాలా మంది టీ లేదా కాఫీ తాగుతారు. ఆ సమయంలో అలాంటివాటికన్న నిమ్మకాయ నీళ్లు లేదా మంచినీళ్లు తాగితే ఎంతో మంచిదంటున్నారు నిపుణులు. దీంతో శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకుపోయి శరీరం శుద్ది అవుతుంది. దీని వల్ల శరీరం హుషారుగా ఉండడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారు.
అలాగే పండ్లలో ఉండే న్యూట్రీషిన్స్, ప్రోటీన్స్ వ్యాధి నిరోధకశక్తిని పెంచి శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది. ముఖ్యంగా పండ్లను ఉదయం తీసుకుంటే ఆ రోజంతా మిమ్మల్ని హుషారుగా ఉంచుతాయి.
త్వరగా నిద్ర లేవడం అలవాటు చేసుకోండి:
ప్రతి రోజు నిద్రలేచే సమయం కన్నా మరో గంట ముందుగా నిద్రలేచే అలవాటు చేసుకోండి. ఉదయాన్నే మేల్కొవడం వల్ల ఆరోగ్యానికి ఒక మంచి అలవాటు అలవడడమే కాకుండా ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో దోహదపడుతుంది.
వ్యాయమం అలవాటు చేసుకోండి:
నిద్రలేచిన తర్వాత వ్యాయమం చేయడం అలవాటు చేసుకోండి. ఒక వేళ మీకు ఆ అలవాటు లేకపోయినా.. అలవాటు చేసుకోవడం మంచిది. వ్యాయమం చేయడం వల్ల శరీరం హుషారుగా మారుతుంది. ఆరోగ్యంగా ఉండగలుగుతారు. జబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు.
సంగీతాన్ని వినండి:
నిద్ర లేవగానే రోజు హాయిగా ఉండడానికి మీకు నచ్చిన సంగీతాన్ని వినండి. సంగీతం మనలో చైతన్యం పెంచుతుంది. అంతేకాకుండా మన మూడ్ రొటీన్‌గా ఉండకుండా సంగీతం సాయం చేస్తుంది. అలా ప్రతి రోజు నిద్రలేవనగా ఇలాంటివి చేస్తే హుషారుగా ఉండడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి: