AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pneumonia: పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? న్యుమోనియా ఉన్నట్లే..!

Pneumonia Symptoms:పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కొన్ని కొన్ని వ్యాధులు చుట్టుముట్టాయంటే భారీ ఎత్తున ఖర్చు చేసుకోవాల్సి..

Pneumonia: పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? న్యుమోనియా ఉన్నట్లే..!
Subhash Goud
|

Updated on: Nov 10, 2021 | 11:50 AM

Share

Pneumonia Symptoms:పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కొన్ని కొన్ని వ్యాధులు చుట్టుముట్టాయంటే భారీ ఎత్తున ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పిల్లలకు వచ్చే వ్యాధుల్లో న్యూమోనియా. ఇది ఊపిరితిత్తులకు వచ్చే అంటువ్యాధి. ఆల్వియాలైలోని నాళాలలో ప్రవహించే రక్తం, గాలిలోని ఆక్సిజన్‌ను స్వీకరించి, కార్బన్‌ డై ఆక్సైడ్‌ను విసర్జిస్తుంది. ఈ న్యుమోనియా బ్యాక్టీరియా, వైరస్‌లతో పాటు ఫంగస్‌, వివిధ రసాయనాల వల్లకూడా సోకే ప్రమాదం ఉంది.

న్యుమోనియా లక్షణాలు:

న్యుమోనియా లక్షణాలు అనుకోకుండా ప్రారంభం అవుతాయి. అవి మెల్లమెల్లగా తీవ్రమై మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. వాంతులు, ఆకలి మందగించడం, చలి ఎక్కువగా ఉండటం, జ్వరంతో ఇబ్బందులు పడటం, అలాగే జలుబు కారణంగా ముక్కు కారవడం అనేది ఎక్కువ అవుతుంటుంది. ఈ లక్షణాలన్ని నిమోనియా ప్రారంభ దశలోనే కనిపిస్తుంటాయి. ఇలాంటి సమయంలో సరైన వైద్యం అందిస్తే మంచి ఫలితం ఉంటుంది. లేకపోతే వ్యాధి మరింత ముదిరి ప్రాణాలు మీదకు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా వ్యాధి ముదిరినకొద్ది ఫిట్స్‌ కూడా వచ్చే అవకాశాలున్నాయంటున్నారు.

న్యుమోనియా ఎవరికి ఎక్కువగా వస్తుంది..?

► 2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు. ► 65 సంవత్సరాలుపైబడిన వారు ► ఆస్పత్రిలో చేరిన రోగులు, ఎక్కువ కాలం ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో వెంటిలేటర్‌ఫై ఉన్నట్లయితే. ► ఆస్తమా, దీర్ఘకాలిక అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌, గుండె వ్యాధులు వంటి దీర్ఘకాలిక ఊపిరితిత్తులు ఉన్న రోగులకు. ► ధూమపానం అలవాటు ఉన్న వారికి.

న్యుమోనియా ఒకరి నుంచి మరొకరికి..

న్యుమోనియా అంటు వ్యాధి. ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉంది. తుమ్మడం వల్ల క్రిములు మరో వ్యక్తి పీల్చే గాలి ద్వారా సోకుతుంది. మంచి పరిశుభ్రత పాటించడం వల్ల క్రిములు వ్యాపించకుండా చేసుకోవచ్చు. పిల్లలకు ఈ వ్యాధి బారిన పడగానే సకాలంలో వైద్యం అందించడం ఎంతో ముఖ్యం. లేకపోతే మరణానికి దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా రెండు నెలలలోపు వయసున్న పిల్లలకు పోషకాహార లోపాలతో బాధపడుతున్న శిశువుల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. బిడ్డల్లో శ్వాసక్రియ వేగాన్ని బట్టి వ్యాధి తీవ్రతను గుర్తించవచ్చు.

ఇవి కూడా చదవండి:

Heart Attack: ఎక్కువగా బాత్‌రూమ్‌లోనే గుండెపోటు ఎందుకు వస్తుంది..? పరిశోధనలలో కీలక విషయాలు

Children Health: తల్లిపాలతో న్యుమోనియాకు చెక్‌.. పిల్లల్లో ఆ వ్యాధులు రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి!

Health Problems: మీరు నిద్రించే ముందు ఈ పనులు చేస్తున్నారా..? ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందంటున్న నిపుణులు..!

Plastic Utensils: మీరు ప్లాస్టిక్‌ పాత్రలో ఆహారం తింటున్నారా..? ప్రమాదమే.. తాజా పరిశోధనలో కీలక అంశాలు

Health Tips: మీరు ఉదయం లేవగానే ఈ పనులు చేస్తున్నారా..? జాగ్రత్త.. మీ మూడ్‌ను పాడు చేస్తాయి..!