Health Problems: మీరు నిద్రించే ముందు ఈ పనులు చేస్తున్నారా..? ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందంటున్న నిపుణులు..!
Health Problems: ఇప్పుడున్న కాలంలో అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న నుంచి పెద్దల వరకు ఏదో ఒక అనారోగ్య..
Health Problems: ఇప్పుడున్న కాలంలో అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న నుంచి పెద్దల వరకు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నవారు ఉన్నారు. అందుకు కారణం జీవనశైలి. జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటే జీవితాన్ని సాఫిగా సాగించుకోవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. నిత్యం మనం సరైన సమయానికి భోజనం చేయడం, వ్యాయామం చేయడంతోపాటు తగినన్ని గంటల పాటు కూడా నిద్రించాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. అయితే ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం లేదు. దీంతో నిద్రలేమి సమస్య బారిన పడుతున్నారు. ఎవరైనా సరే.. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. నిద్రించే ముందు ఈ పనులు అస్సలు చేయరాదంటున్నారు వైద్య నిపుణులు.
తినే ఆహారంలో సమయ పాలన: మనం తినే ఆహారంలో కూడా సమయ పాలన పాటించాల్సి ఉంటుంది. సమయ పాలన లేకుండా భోజనం చేస్తే అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. రాత్రి పూట భోజనానికి, నిద్రకు కనీసం 3 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. కొందరు నిద్రించే ముందు భోజనం చేస్తుంటారు. ఇక కొందరు కొవ్వు పదార్థాలు, కారం, మసాలాలు దట్టించిన ఆహారాలను బాగా తిని వెంటనే నిద్రిస్తారు. అలా చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. గ్యాస్, అసిడిటీ, తలతిరగడం, అధికంగా బరువు పెరగడం, గుండెపోటు, డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే నిద్రించే ముందు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం మంచిదంటున్నారు. అలాగే తిండికి, నిద్రకు మధ్య కనీస వ్యవధి ఉండేలా చూసుకోవాలి. దీంతో నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుంది.
మద్యం సేవించి నిద్రించడం: అలాగే మద్యం సేవించి నిద్రించడం వల్ల నిద్రలేమి సమస్య బారిన పడాల్సి వస్తుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అందుకే రాత్రి పూట చక్కగా నిద్ర పట్టాలంటే మద్యానికి దూరంగా ఉండటం మంచిది.
దగ్గు, జలుబు, అలర్జీల కోసం వేసుకునే మందులు కూడా కొందరిలో నిద్రలేమిని కలిగిస్తాయి. ఆ మందులను వైద్యుల సలహా మేరకు కొంతకాలం పాటు మాత్రమే వాడాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు ఆ మెడిసిన్‌ను వాడితే దీర్ఘకాలికంగా అనేక అనారోగ్య సమస్యలు రావడంతోపాటు నిద్రలేమి సమస్య కూడా వస్తుంది. నిద్రలేమి నుంచి బయటపడాలంటే ఆ మందులను వేసుకోవడం మానేయాలి.
రాత్రిపూట ఫోన్, టీవీలకు దూరంగా ఉండాలి: రాత్రి పూట ఫోన్, టీవీ, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండటం ఎంతో మంచిది. రాత్రి సమయాల్లో వీటి ముందు ఉంటే నిద్రలేమి సమస్య తలెత్తే అవకాశం ఉంది. అంతేకాదు ఈ కారణంగా అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందంటున్నారు పరిశోధకులు. మనం ఇలాంటివి చేయడం వల్ల మనకు తెలియకుండానే ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చిపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి: