AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Children Health: తల్లిపాలతో న్యుమోనియాకు చెక్‌.. పిల్లల్లో ఆ వ్యాధులు రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి!

Children Health: ఇప్పుడున్న కాలంలో చాలా మంది జబ్బుల బారిన పడుతున్నారు. తినే ఆహారం, కాలుష్యం, నిద్రలేమి, మానసిక ఆందోళన, ఉద్యోగంలో ఒత్తిళ్లు తదితర..

Children Health: తల్లిపాలతో న్యుమోనియాకు చెక్‌.. పిల్లల్లో ఆ వ్యాధులు రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి!
Subhash Goud
|

Updated on: Nov 06, 2021 | 5:54 AM

Share

Children Health: ఇప్పుడున్న కాలంలో చాలా మంది జబ్బుల బారిన పడుతున్నారు. తినే ఆహారం, కాలుష్యం, నిద్రలేమి, మానసిక ఆందోళన, ఉద్యోగంలో ఒత్తిళ్లు తదితర కారణాల వల్ల మానవుడు జబ్బుల బారిన పడుతున్నాడు. అలాగే పిల్లల్లో కూడా అనేక రకాల జబ్బులు దరి చేరుతుంటాయి. శిశువు వ్యాధుల బారిన పడినప్పుడు పెరుగుదలలో లోపం ఏర్పడుతుంది. అలాంటి విషయాలలో ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్నారు వైద్య నిపుణులు. అనారోగ్య సమయంలో పసిబిడ్డల ఆకలి బాగా తగ్గిపోతుంది. వాంతులు, విరేచనాలు పెరుగుతాయి. దీని కారణంగా ఆహారం తినేందుకు వెనుకంజ వేస్తారు. శిశువు నుంచే అన్ని రకాల మంచి ఆహారపదార్థాలను అందించడం అలవాటు చేయాలని, లేకపోతే పెరుగుతున్నకొద్ది తినేందుకు ఇష్టపడరని చెబుతున్నారు.

అయితే అతిసార వ్యాధి, మశూచి దరిచేరినప్పుడు తీసుకునే ఆహారం కొంత మేర ఒంటికి పడుతుంది. కొంత మంది తల్లిదండ్రులు పిల్లలకు ఆహారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. వాస్తవానికి చెప్పాలంటే ఆరోగ్యవంతులతో పోలిస్తే అనారోగ్యం బారిన పడేవారి ఆహార అవసరాలే ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. అందువల్ల అనారోగ్యం సమయంలో పిల్లలకు పోషకాలతో కూడిన ఆహారం ఇవ్వడం ఎంతో ముఖ్యమంటున్నారు. వారు ఆహారం తినేందుకు ప్రత్యేక శ్రద్ద చూపేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలి. అందులో అనారోగ్యం బారిన పడిన పిల్లలు కోలుకునే సమయంలో ఎక్కువగా ఆకలివేస్తుంటుంది. అందుకే అంతకు ముందు కన్నా కోలుకునే ముందు ఎక్కువ ఆహారం ఇచ్చేలా ప్రయత్నించాలి.

శిశువుకు ఇష్టమైన పదార్థాలను మెత్తగా చేసి కొద్ది కొద్దిగా పెడుతుండాలి. అందులోనూ తల్లిపాలు చాలా ముఖ్యం. ఈ సమయంలో బిడ్డలు ద్రవ పదార్థాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. శిశువు గతంలో ఉన్న బరువు కోలుకున్న తర్వాత తెగలిగితే అనారోగ్యం నుంచి కోలుకున్నట్లేనంటున్నారు పిల్లల వైద్య నిపుణులు.

పిల్లలకు తరచూ ఇబ్బంది పెట్టేవి.. పిల్లలకు తరుచుగా ఇబ్బంది పెట్టేవి దగ్గు, జలుబు. వీటిపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ద వహించాల్సి ఉంటుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేస్తే న్యుమోనియా దరిచేరే అవకాశం ఉంది. దీని వల్ల ఊపిరితిత్తులు చెడిపోయే ప్రమాదం ఉంది.

తల్లిపాలతో న్యుమోనియాకు చెక్‌.. పిల్లలకు న్యుమోనియా దరిచేరితే అందుకు చెక్‌ పెట్టే మార్గాలున్నాయి. తల్లిపాలతో న్యుమోనియాను అరికట్టవచ్చు. ఎందుకంటే తల్లిపాలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. విటమిన్‌ఎ ఎక్కువగా ఉండే పసుపు పచ్చ ఫలాలు, ఆకు కూరలు కూడా శ్వాసకోశ వ్యాధుల నుంచి కాపాడుతాయి. నిమోనియా అనేది ఊపిరితిత్తులకు వచ్చే ఒక అంటువ్యాధి. ఊపిరితిత్తులలో అల్వియోలీ అనే చిన్న చిన్న గదులుంటాయి. మనం గాలి పీల్చుకున్నప్పుడు ఈ గదులలో గాలి నిండుతుంది. అయితే నిమోనియా వచ్చిన పిల్లల్లో గాలి పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది. వారికి ఆక్సిజన్‌ మోతాదు తగ్గిపోతుంది.

దగ్గు, జలుబు ఉంటే తల్లిపాలు తాగడం కష్ట: కాగా, పిల్లలకు దగ్గు, జలుబు ఉన్నప్పుడు తల్లిపాలు తాగడం కాస్త కష్టంగానే ఉంటుందని పిల్లల వైద్య నిపుణులు చెబుతున్నారు. అలా ఇబ్బంది ఉన్నా.. పాలు ఇవ్వడం మాత్రం ఆపకూడదంటున్నారు. తల్లిపాల ద్వారా బిడ్డకు రోగనిరోధక పెంపొందుతుంది. అంతేకాదు పోషకాహార లోపాలను కూడా అరికడతాయి.

ఇవి కూడా చదవండి:

Hand Numbness: మీకు తిమ్మిర్లు ఎక్కువగా వస్తున్నాయా..? కారణాలు ఏమిటి.. వైద్యులేమంటున్నారు..?

Carrots Benefits: క్యారెట్‌తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా..? గుండె ఆరోగ్యానికి మంచి ఔషధం..!

Ginger Tea: ప్రతి రోజు ఉదయాన్నే అల్లం టీ తాగితే ఎన్నో ఉపయోగాలు.. తెలిస్తే తాగకుండా ఉండలేరు..!