Carrots Benefits: క్యారెట్‌తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా..? గుండె ఆరోగ్యానికి మంచి ఔషధం..!

Carrots Benefits: ప్రస్తుతం అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరుగుతోంది. అందుకు కారణాలు లేకపోలేదు. తినే ఆహారం, మానసిక ఆందోళన, కాలుష్యం తదితర కారణాల..

Carrots Benefits: క్యారెట్‌తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా..? గుండె ఆరోగ్యానికి మంచి ఔషధం..!
Follow us
Subhash Goud

| Edited By: Anil kumar poka

Updated on: Nov 04, 2021 | 9:11 AM

Carrots Benefits: ప్రస్తుతం అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరుగుతోంది. అందుకు కారణాలు లేకపోలేదు. తినే ఆహారం, మానసిక ఆందోళన, కాలుష్యం తదితర కారణాల వల్ల ఎందరో వివిధ రకాల వ్యాధులను కొనితెచ్చుకుంటున్నారు. ఇక శీతాకాలం వచ్చేసింది. ఈ కాలంలో అనారోగ్య సమస్యలు వెంటాడే అవకాశం ఉంది. శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలను కంట్రోల్లో ఉంచుకునేందుకు క్యారెట్‌లను తీసుకోవడం ఎంతో మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు క్యారెట్‌లో బీటా-కెరోటిన్ స్థాయిలు పుష్కలంగా ఉంటాయి. ఈ బీటా-కెరోటిన్ మన శరీరంలో విటమిన్‌ ఎగా మారి శరీరంలో ఉండే చెడు కొవ్వు పదార్థాలను బయటకు తొలగించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. అంతేకాదు క్యారెట్‌ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంటుంది. ఇందులో ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియంతో అధికంగా ఉంటుంది. అలాగే బరువు తగ్గేందుకు, కంటి ఆరోగ్యం ఉంచేందుకు విటమిన్లు, ఖనిజాలు అధిక సంఖ్యలో ఉంటాయి.

క్యారెట్ రసం:

క్యారెట్ రసం దృష్టికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. క్యారెట్‌లోని విటమిన్ A పుష్కలంగా ఉంటుంది. ఇది దృష్టిని మెరుగు పరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి రోజు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల చూపు మెరుగుపడుతుంది.

క్యారెట్‌ మరిన్ని ఉపయోగాలు..

క్యారెట్‌లో ఉండే విటమిన్లు జుట్టు పొడిబారకుండా చేస్తుంది. రోజు ఉదయాన్నే క్యారెట్‌ తింటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. పోటాషియం రక్త నాళాల ధమనుల ఉద్రిక్తతను తగ్గించేందుకు క్యారెట్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే శరీరంలో రక్త ప్రసరణ పెంచేందుకు కూడా ఉపయోగపడుతుంది. చర్మం కాంతివంతగా ఉంచుతుంది. క్యారెట్‌ తినడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు కరిగిపోతుంది. తద్వారా బరువు కూడా తగ్గేందుకు దోహదపడుతుంది. క్యారెట్‌లో రక్తహీనత పోగొట్టే గుణం ఉంటుంది. ఇది ప్రేగుల్లో వ్వర్థాలను శుభ్రం చేసేలా చేస్తుంది. క్యారెట్‌ను తరచు తీసుకోవడం వల్ల మలబద్దకాన్ని దూరం చేస్తుంది. క్యారెట్‌లో పోషక విలువలతో పాటు రోగనిరోధక శక్తి పెంచే గుణాలున్నాయి.

ఇన్‌ఫెక్షన్లు రాకుండా..

క్యారెట్ జ్యూస్ రోజూ తాగడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఇన్‏ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అంతే కాకుండా శరీరంలో వచ్చే వాపులను సైతం అధిగమించవచ్చు. బాక్టీరియా, వైరస్ లాంటివి నశిస్తాయి. వీటిలో ఉండే విటమిన్ బి6, కె. పొటాషియం, పాస్ఫరస్‏లు ఎముకలను దృఢంగా మారుస్తాయి. క్యారెట్‌ గుండె సమస్యలను కూడా తగ్గిస్తుంది. శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్ అనే అణువులు ఉండడం వలన రోగనిరోధక శక్తి తగ్గుతుంది. వీటి వల్ల క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. క్యారెట్ జ్యూస్ తాగడం వలన అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆ ఫ్రీ ర్యాడికల్స్ అణువులను నాశనం చేయడంతోపాటు, శరీరంలో ఉండే విష పదార్థాలను బయటకు పంపుతాయి.

ఇవి కూడా చదవండి:

Cardamom: యాలకుల ధర ఎందుకు ఎక్కువగా ఉంటుంది.. ఇవి ఎక్కడ పండిస్తారు.. ఎలాంటి నేలల్లో పండుతుంది..?

Diabetes: ఇది తినడం వల్ల డయాబెటిస్‌ వస్తుందా..? వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

మీరు ఆర్డర్‌ను రద్దు చేస్తే ఫ్లిప్‌కార్ట్‌కు జరిమానా చెల్లించాలి!
మీరు ఆర్డర్‌ను రద్దు చేస్తే ఫ్లిప్‌కార్ట్‌కు జరిమానా చెల్లించాలి!
అమెరికాలో తెనాలి యువతి దుర్మరణం.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
అమెరికాలో తెనాలి యువతి దుర్మరణం.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
ఎల్‌కే అద్వానీ ఆరోగ్యం ఎలా ఉందంటే..?
ఎల్‌కే అద్వానీ ఆరోగ్యం ఎలా ఉందంటే..?
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
ఈవీ రంగానికి పెట్టుబడుల వరద.. వచ్చే ఐదేళ్లలో 3.4 లక్షల కోట్లు
ఈవీ రంగానికి పెట్టుబడుల వరద.. వచ్చే ఐదేళ్లలో 3.4 లక్షల కోట్లు
బిగ్ బాస్ విన్నర్‌ ప్రైజ్‌ మనీని రివీల్ చేసిన నాగ్.. ఎంతంటే?
బిగ్ బాస్ విన్నర్‌ ప్రైజ్‌ మనీని రివీల్ చేసిన నాగ్.. ఎంతంటే?
టీవీ9 న్యాయపోరాటానికి దిగివచ్చిన మోహన్‌బాబు
టీవీ9 న్యాయపోరాటానికి దిగివచ్చిన మోహన్‌బాబు
వాజేడు ఎస్సై సూసైడ్ కేసులో ట్విస్ట్.. యువతి వేధింపులే అసలు కారణం
వాజేడు ఎస్సై సూసైడ్ కేసులో ట్విస్ట్.. యువతి వేధింపులే అసలు కారణం
ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటే ఫెనాల్టీ బాదుడు.. అసలు క్లారిటీ ఇదే..!
ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటే ఫెనాల్టీ బాదుడు.. అసలు క్లారిటీ ఇదే..!