Ipomoea Carnea: కాల్వగట్టున కనిపించే ఈ కలుపుమొక్క చెట్టు పాలతో తేలు కాటు విషానికి చెక్…
Ipomoea Carnea: రబ్బరు చెట్టు పల్లెటూర్లలో కాలువ పక్కన అందమైన పువ్వులతో కనిపించే చెట్లు. అయితే ఈ చెట్లు ఏ విధమైన కాయలు కాయవు. పువ్వులను..
Ipomoea Carnea: రబ్బరు చెట్టు పల్లెటూర్లలో కాలువ పక్కన అందమైన పువ్వులతో కనిపించే చెట్లు. అయితే ఈ చెట్లు ఏ విధమైన కాయలు కాయవు. పువ్వులను పూజకు కూడా ఉపయోగించారు. ఈ చెట్టుని విరగగొట్టడం చాలా కష్టం కనుక పల్లెల్లో రబ్బరు చెట్టు అని వ్యవహారిక నామంగా ఉపయోగించేవారు. ఎక్కడ నీరు నిల్వ ఉంటుందో.. ఆ ప్రాంతంలో అధికంగా కనిపిస్తాయి. అయితే ఈ చెట్లు విషపూరితం.. కానీ ఆయుర్వేద చికిత్సలో పై పూతగా ఉపయోగించే ఔషధాల్లో ఉపయోగిస్తారు. పూర్వకాలంలో పల్లెల్లో ఈ చెట్లను ఇంటి ముందు రక్షణ కోసం గోడగా కట్టుకునేవారు. ఈ చెట్లను రబ్బరు చెట్లు, లొట్టపీసు చెట్లు, పాలసముద్రపు చెట్లు అంటారు. ఇవి కాన్వవులేసీ కుటుంబానికి చెందినవి. వీటి శాస్త్రీయనామం ఐఫోమియా కార్నియా. ఈ రోజు ఈ మొక్క వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
ఈ మొక్కలు విషపూరితం కనుక.. ఏ జంతువులు వీటిని తినవు.. అయితే ఈ చెట్ల పాలను పై పూతగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా తేలు కుడితే.. ఈ చెట్టు నుంచి తీసిన పాలను తేలు కుట్టిన ప్రాంతంలో రాస్తే.. చక్కటి మెడిసిన్ గా పనిచేస్తుంది. తేలు విషాన్ని విరిచేస్తుంది. అంతేకాదు తామర వంటి చర్మ వ్యాధితో బాధపడేవారు ఈ పాలు మంచి మెడిసిన్.
ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటె… ఈ ఆకులను పొగ వేస్తే.. దోమలు పరారీ… ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో వీటి ఆకులను దోమల నివారణకు ఉపయోగిస్తూనే ఉన్నారు.
ఈ చెట్లను ఎక్కువుగా కాగితం తయారీకి ఉపయోగిస్తారు.
అంతేకాదు అన్నదాతలు వరి పంటకు వచ్చే దోమపోటు నివారణ కోసం ఈ చెట్ల ఆకులనుంచి సహజమైన రసాయనిక మందుని తయారు చేసి ఉపయోగిస్తారు.
రైతులకు వరిలో వచ్చే దోమపోటును తగ్గించడానికి ఉపయోగిస్తారు.
పల్లెటూర్లలో కాలువ పక్కన పిచ్చి మొక్కలుగా పెరిగే ఈ మొక్కల్లో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి . ఈ చెట్టు కొమ్మను నీటిలో వేసినా కూడా ఈ చెట్టు ఏపుగా పెరుగుతుంది. అదే ఈ మొక్కలో ఉన్న మరో ప్రత్యేకత.