Hand Numbness: మీకు తిమ్మిర్లు ఎక్కువగా వస్తున్నాయా..? కారణాలు ఏమిటి.. వైద్యులేమంటున్నారు..?

Hand Numbness: మన శరీరంలో జరిగే కొన్ని పరిణామాల వల్ల మనకు ముందస్తుగా తెలిసిపోతుంది. అప్పుడు నిర్లక్ష్యం చేస్తే మరింత ప్రమాదం పొంచివుండే..

Hand Numbness: మీకు తిమ్మిర్లు ఎక్కువగా వస్తున్నాయా..? కారణాలు ఏమిటి.. వైద్యులేమంటున్నారు..?
Follow us
Subhash Goud

| Edited By: Anil kumar poka

Updated on: Nov 04, 2021 | 9:11 AM

Hand Numbness: మన శరీరంలో జరిగే కొన్ని పరిణామాల వల్ల మనకు ముందస్తుగా తెలిసిపోతుంది. అప్పుడు నిర్లక్ష్యం చేస్తే మరింత ప్రమాదం పొంచివుండే అవకాశం ఉంది. సాధారణంగా మన శరీరంలో ఏదో ఒక భాగంలో అప్పుడప్పుడు తిమ్మిర్లు వస్తుంటాయి. ఆ భాగంలో నరాలకు మెదడు నుంచి సంకేతాల సరఫరా అవుతూ ఉంటుంది. చేతులకు తిమ్మిర్లు వచ్చాయంటే దాని అర్థం మెడ నుంచి చేతిలోకి ఆ భాగానికి వెళ్లే నరాల సరఫరా ఆగిపోతుందని అర్థం. అంటే.. ఆ నరాలు బలవంతంగా నొక్కుకుపోతే.. వాటి నుంచి సంకేతాల సరఫరా చెయ్యికి ఆగిపోతుంది. నరాలకు స్వయంగా రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. నరంపై ఒత్తిడి పడినప్పుడు.. రక్తం సరఫరా ఆగిపోతుంది. దాంతో చెయ్యికి ఆక్సిజన్, పోషకాలు అందడం నిలిచిపోతుంది. దాంతో చెయ్యి చచ్చుబడినట్లు అవుతుంది. దాన్ని మనం ముట్టుకుంటే కూడా మనకు స్పర్శ తెలియదు. మనం నిద్ర లేచాక… నరంపై ఒత్తిడి పోయి రక్త సరఫరా మొదలై చెయ్యికి ఉన్న తిమ్మిర్లు పోతాయి.

ఐదు నిమిషాల్లో తిమ్మిర్లు తగ్గకపోతే.. ఇలా ఐదు నిమిషాల్లో తిమ్మిర్లు తగ్గకపోతే మనం ఎలాంటి ఖంగారు పడాల్సిన అవసరం లేదు. కొంత మందికి అలా జరగదు. రోజుల తరబడి తిమ్మిర్లు అలాగే వస్తుంటాయి. అంటే దాని అర్థం.. చెయ్యికి రక్తాన్ని సరఫరా చేసే నరాలు దెబ్బతిన్నాయని అర్థం. అలాంటి వారికి రాత్రిళ్లు పడుకొని లేచాక తరచూ చేతులు తిమ్మిర్లు అవుతూనే ఉంటాయి. ఇలాంటి వారు ఎంఆర్‌ఐ (MRI) చేయించుకోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా జరుగకుండా ఉండాలంటే రాత్రివేళ నిద్రపోయే సమయంలో మెడను పద్దతిగా ఉంచుకోవాలి. కళ్లు ఆకాశంవైపు చూస్తున్నట్లుగా, పొట్ట ఆకాశం వైపు ఉన్నట్లుగా పడుకుంటే మెడ దగ్గర నుంచి వెళ్లే నరాలు దెబ్బతినకుండా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువసేపు కంప్యూటర్‌పై కూర్చుంటున్నారా..? నిద్రించే సమయంలోనే కాకుండా ఎక్కువ సేపు కంప్యూటర్‌ దగ్గర కూర్చున్నా.. భుజాల దగ్గర నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనినే థొరాసిక్‌ ఔట్లెట్‌ సిండ్రోమ్‌ (Thoracic outlet syndrome) అంటారు. కూర్చున్నప్పుడు తల ముందుకు వస్తూ ఉంటుంది. అప్పుడే నరాలు దెబ్బతింటాయి. భుజాల ఎక్సర్‌సైజులు చెయ్యడం ద్వారా సమస్య రాకుండా నివారించవచ్చు. లేదా.. మధ్య మధ్యలో పనికి గ్యాప్ ఇచ్చి అటూ ఇటూ నడవాలి. ఇక అప్పటికీ తిమ్మిర్లు తరచూ వస్తూ ఉంటే… డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిందే.

చెయ్యి నరం దెబ్బతింటే.. అలాగే నడుం దగ్గర అసలైన చెయ్యికి సంబంధించిన నరం దెబ్బ తింటే కూడా తిమ్మి్ర్ల సమస్య వస్తుంది. దీన్నే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ (carpal tunnel syndrome) అంటారు. నడుం నుంచి ఈ టన్నెల్ (సొరంగం) లాంటిది వెళ్తుంది. ఇలాంటి సమస్య వల్ల తిమ్మిర్లు వస్తున్నాయని అనిపిస్తే.. వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. పదేపదే తిమ్మిర్లు వస్తుండటం, లేదా తెల్లారి లేచాక తరచూ తిమ్మిరులు వస్తుంటే తప్పకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Diabetes: ఇది తినడం వల్ల డయాబెటిస్‌ వస్తుందా..? వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

Winter Heart Attack: శీతాకాలంలో గుండెపోటు అధికం.. నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి..!