Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Heart Attack: శీతాకాలంలో గుండెపోటు అధికం.. నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి..!

Winter Heart Attack: శీతాకాలం వచ్చేసింది. చాలా అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. చిన్నారులు మొదలుకొని వృద్ధుల వరకు ఎన్నో ఆరోగ్య సమస్యలకు..

Winter Heart Attack: శీతాకాలంలో గుండెపోటు అధికం.. నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి..!
Winter Heart Attack
Follow us
Subhash Goud

| Edited By: Phani CH

Updated on: Nov 02, 2021 | 9:49 AM

Winter Heart Attack: శీతాకాలం వచ్చేసింది. చాలా అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. చిన్నారులు మొదలుకొని వృద్ధుల వరకు ఎన్నో ఆరోగ్య సమస్యలకు గురవుతుంటారు. చలి ఎక్కువైతే గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. రక్తనాళాలు కుంచించుకుపోతాయి. రక్తపోటు పెరుగుదలతో పాటు స్ట్రోక్, గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

శీతాకాలంలో పెరిగే ప్రమాదాలు..

శీతాకాలంలో రక్త నాళాలు కుంచించుకుపోతాయి. ఇరుకైన రక్తనాళాల గుండా రక్తం వెళ్లడానికి ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణంగా రక్తపోటు వచ్చే అవకాశాలుంటాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. తీవ్రమైన చలి సమయంలో రక్తం మందంగా, జిగటగా మారుతుంది. ఇది రక్తం గడ్డకట్టడాన్ని సులభతరం చేస్తుంది. చాలా స్ట్రోక్స్‌ రక్తం గడ్డకట్టడం వల్లనే సంభవిస్తాయి. న్యూయార్క్‌ మౌంట్ సినాయ్‌ ఐకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. శీతాకాలంలో జలుబు, ఫ్లూ నుంచి రక్షణ పొందడానికి రోగనిరోధక వ్యవస్థ రక్త స్థాయిలు అనేక రెట్లు పెరుగుతాయి. దీనివల్ల ధమనుల గోడలపై ప్లేక్స్‌ పేరుకుపోతాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీ వివరాల ప్రకారం.. ఊబకాయం, సిగరెట్‌ తాగే అలవాటు, అధిక రక్తపోటు ఉన్నవారికి స్ట్రోక్, గుండెపోటు వచ్చే ప్రమాదం 30 శాతం ఎక్కువ. అమెరికా సీడీసీ వివరాల ప్రకారం చూస్తే.. రక్తపోటు ఎక్కువగా ఉంటే అది గుండెకు హాని కలిగించడమే కాకుండా స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

అయితే శీతాకాలంలో గుండెకు సంబంధించిన సమస్యలను తగ్గించుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. వీటిలో ముఖ్యంగా నిత్యం 20 నిమిషాల సూర్యకాంతిలో ఉండటం, ఆహారంలో 30 శాతం ప్రొటీన్లు తీసుకోవడం, రోజూ 40 నిమిషాలు పాటు వ్యాయామం చేయడం వంటివి. వీటి వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. వీటిని పాటించడం వల్ల చలికాలంలో గుండెపోటు నుంచి రక్షించుకోవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రతి రోజు కనీసం 20 నిమిషాల పాటు సూర్యకాంతిలో ఉన్నట్లయితే గుండెకు సంబంధిత వ్యాధుల నుంచి దూరం కావచ్చంటున్నారు. సూర్యరశ్మి కారణంగా శరీరం శరీరంలో యాంటీబాడీలను ఎక్కువగా తయారవుతాయి. ఈ సూర్యకాంతి మనకు వాపు, అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుంది. మెదడు పని చేసే సామర్థ్యాన్ని మెరుగు పరుస్తుంది. అందువల్ల నిత్యం 20 నిమిషాలపాటు ఉదయం ఎండలో కూర్చోవడం అలవాటు చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

30 శాతం ప్రోటీన్:

సూర్యకాంతి ద్వారా విడుదలయ్యే సెరోటోనిన్ అనే హార్మోన్, కార్బోహైడ్రేట్లను కూడా విడుదల చేస్తుంది. చలి కాలంలో సూర్యకాంతి తీవ్రత తక్కువగా ఉన్న కారణంగా ఆకలి భావన అధికంగా ఉంటుంది. ప్రోటీన్ ఆకలి హార్మోన్ గ్రెలిన్‌ను తగ్గిస్తుంది. ఆహారంలో తీసుకునే క్యాలరీల్లో 30 నుంచి 35 శాతం ప్రొటీన్ల నుంచి వస్తే ఆకలి తగ్గుతుంది. దీంతో బరువు పెరిగే అవకాశాలు తగ్గుతాయంటున్నారు.

40 నిమిషాల వ్యాయామం:

చలికాలంలో ప్రతీ రోజు కనీసం 40 నిమిషాల పాటు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల అధిక రక్తపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం 27 శాతం తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ, సైకాలజీ, న్యూరోసైన్స్ వివరాల ప్రకారం.. రోజుకు 30 నుంచి 40 నిమిషాలు వ్యాయామం చేసే వ్యక్తులు డిప్రెషన్ ప్రమాదాన్ని 28 శాతం తక్కువ కలిగి ఉంటారు.

ఇవి కూడా చదవండి:

Heart Disease: మీకు రోజు జిమ్‌ చేసే అలవాటు ఉందా..? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి..!

Heart Attack: గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? నిపుణులు ఏమంటున్నారు..?

Turmeric Benefits: పసుపు క్యాన్సన్‌ నివారణకు ఉపయోగపడుతుందా..? పరిశోధనలలో కీలక అంశాలు వెల్లడి..!